నందమూరి బాలకృష్ణ (Balakrishna) ‘వీరసింహారెడ్డి’ థియేట్రికల్ రిలీజ్ తో బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం ఓటీటీలోకీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది. సంబంధించిన డిటేయిల్స్ ఇలా ఉన్నాయి.
నందమూరి బాలయ్య లేటెస్ట్ యాక్షన్ ఫిల్మ్ ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy). డైరెక్టర్ గోపీచంద్ మాలినేని దర్శకత్వం వహించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12 ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలై బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మాతలు నవీన్ ఏర్నేని, రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం ప్రేక్షకులకు మాస్ ట్రీట్ ను అందించింది. రిలీజ్ కు ముందు సినిమాపై పెంచిన అంచనాలను రీచ్ అయ్యింది. అటు బాక్సాఫీస్ వద్ద కూడా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి కాసుల వర్షం కురిపింది.
ఇక ఈ చిత్రాన్ని ఓటీటీలోనూ వీక్షించేందుకు ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు. చాలా రోజుల తర్వాత బాలయ్య మళ్లీ ఫ్యాక్షన్ రుచి చూపించడంతో ఓటీటీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సందర్భంగా వీరసింహారెడ్డికి సంబంధించిన ఓటీటీ రిలీజ్ డిటేయిల్స్ సోషల్ మీడియాలో ఆసక్తిని కలిగిస్తున్నాయి. లేటెస్ట్ బజ ప్రకారం.. ఈ నెలలో యాక్షన్ ఫిల్మ్ ఓటీటీలోకి రాబోతున్నట్టు తెలుస్తోంది.
ఓటీటీ హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ డిస్నీప్లస్ హాట్ స్టార్ త్వరలో స్ట్రీమింగ్ కు అందుబాటులోకి తీసుకురాబోతున్నట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి 21 నుంచే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని అంటున్నారు. ఓటీటీ రైట్స్ కోసం భారీ డీల్ కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. ఇక త్వరలో స్ట్రీమింగ్ పై అధికారిక ప్రకటన కూడా వస్తుందని అంటున్నారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. వీరసింహారెడ్డిని మరోసారి చూసేందుకు ఫ్యాన్స్ కూడా సిద్ధం అవుతున్నారు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం బాలయ్య - అనిల్ రావిపూడి కాంబోలో నెక్ట్స్ ప్రాజెక్ట్ షురూ అయిన విషయం తెలిసిందే. ‘ఎన్బీకే108’ వర్క్ టైటిల్ తో షూటింగ్ కొనసాగుతోంది. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేస్తుకున్న ఈ చిత్రంపైనా అనిల్ రావిపూడి కూడా ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించారు. తెలంగాణ యాసలో బాలయ్య దుమ్ములేపబోతున్నాడని అన్నారు. దీంతో మరింత హైప్ క్రియేట్ అయ్యింది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. చిత్రంలో హీరోయిన్ గా ప్రియాంక జవాల్కర్ తదితర సీనియర్ హీరోయిన్ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. కూతురి పాత్రలో యంగ్ హీరోయిన్ శ్రీలీలా (Sree leela) కనిపించనుందంట. థమన్ సంగీతం అందిస్తున్నారు.