`భీమ్లా నాయక్‌` నుంచి దసరా ట్రీట్‌.. సెకండ్‌ సింగిల్‌.. కొత్త పోస్టర్‌ అదిరింది

Published : Oct 05, 2021, 05:43 PM IST
`భీమ్లా నాయక్‌` నుంచి దసరా ట్రీట్‌.. సెకండ్‌ సింగిల్‌.. కొత్త పోస్టర్‌ అదిరింది

సారాంశం

`భీమ్లా నాయక్‌` చిత్రానికి సంబంధించిన రెండో పాటని విడుదల చేయబోతున్నారు. దసరా కానుకగా సెకండ్‌ సింగిల్‌ని విడుదల చేయబోతున్నామని  వెల్లడించారు. ఈ మేరకు కొత్తగా ఓ పోస్టర్‌ని పంచుకున్నారు. 

పవన్‌ కళ్యాణ్‌, రానాలు కలిసి నటిస్తున్న `భీమ్లా నాయక్‌`కి సంబంధించి మరో అప్‌ డేట్‌ ఇచ్చింది యూనిట్‌. ఈ సినిమాకి సంబంధించి ప్రారంభం నుంచి ఏదో ఒక విషయాన్ని పంచుకుంటూ చిత్ర బృందం వార్తల్లో నిలుపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా మరో అప్‌డేట్‌ ఇచ్చారు. ఈ సినిమాకి సంబంధించిన రెండో పాటని విడుదల చేయబోతున్నారు. దసరా కానుకగా ఈ నెల 15న సెకండ్‌ సింగిల్‌ని విడుదల చేయబోతున్నామని  వెల్లడించారు. ఈ మేరకు కొత్తగా ఓ పోస్టర్‌ని పంచుకున్నారు. 

`అంతా ఇష్టం.. ` అనే సాంగ్‌ని విజయదశమి రోజుని రిలీజ్‌ చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ పోస్టర్‌లో నిత్యా మీనన్‌, pawan kalyan ఉండటం విశేషం. వీరిద్దరి మధ్య వచ్చే లవ్‌ సాంగ్‌గా ఈ రెండో సింగిల్‌ ఉండబోతుందని తెలుస్తుంది. ఇక ఈ చిత్రంలో పవన్‌ కళ్యాణ్‌,  రానా దగ్గుబాటి హీరోలుగా నటిస్తున్నారు. పవన్‌ సరసన నిత్యా మీనన్‌ నటిస్తుంది. మరోవైపు రానా సరసన సంయుక్త మీనన్‌ నటిస్తున్నారు. 

సాగర్‌ కె చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న bheemla nayak చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ మాటలు, కథనం అందిస్తున్నారు. థమన్‌ సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయబోతున్నారు. 

related news: భీమ్లా నాయక్ అప్డేట్: పవన్ కాదు... నేనే హీరో అంటున్న రానా

ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి భీమ్లా నాయక్‌ పాత్రలో నటిస్తున్న పవన్‌ కళ్యాణ్‌ పోస్టర్లు, టీజర్‌ ఆద్యంతం ఆకట్టుకుంది. సంచలనం క్రియేట్‌ చేసింది. అలాగే `భీమ్లా నాయక్‌` టైటిల్‌ సాంగ్‌కి సైతం భారీ స్పందన వచ్చింది. మరోవైపు rana నటిస్తున్న డేనియర్‌ శేఖర్‌ పాత్ర గ్లింప్స్ విడుదలై ఆకట్టుకుంది. తాను ధర్మేంద్ర.. హీరో అంటూ రానా చెప్పే డైలాగులు ఆయన పాత్ర యాటిట్యూడ్‌ని ప్రతిబింబిస్తుంది. ఈగోలు దెబ్బతిన్న ఇద్దరి మధ్య నెలకొన్న సంఘర్షణ, ఘర్షణ నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. ఇది మలయాళంలో సక్సెస్‌ సాధించిన `అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌` చిత్రానికి రీమేక్‌ అనే విషయం తెలిసిందే. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Allu Arjun `డాడీ` మూవీ చేయడం వెనుక అసలు కథ ఇదే.. చిరంజీవి అన్న ఆ ఒక్క మాటతో
Bigg Boss Telugu 9: లవర్‌కి షాకిచ్చిన ఇమ్మాన్యుయెల్‌.. కప్‌ గెలిస్తే ఫస్ట్ ఏం చేస్తాడో తెలుసా.. తనూజ ఆవేదన