మళ్లీ దొరికిపోయిన బాలకృష్ణ..? అంజలిని వెనకాల టచ్‌ చేసిన వీడియో వైరల్‌..

By Aithagoni RajuFirst Published Jun 1, 2024, 8:30 AM IST
Highlights

బాలకృష్ణ మరోసారి దొరికిపోయాడు. స్టేజ్‌పై ఆయన అంజలిని నెట్టేయడం వివాదంగా మారిన నేపథ్యంలో దానికి అంజలినే ఫుల్‌స్టాప్‌ పెట్టింది, నిర్మాత స్పందించాడు. కానీ ఇప్పుడు మరో వీడియో హల్‌చల్‌ చేస్తుంది. 
 

బాలకృష్ణ ఇటీవల `గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో చేసిన రచ్చ వైరల్‌గా మారుతుంది. సోషల్‌ మీడియాలో అది దారుణంగా ట్రోల్‌ అవుతుంది. స్టేజ్‌పై హీరోయిన్‌ అంజలిని తోసేశాడు. ఆమె ఆ సమయంలో నవ్వుతూనే కవర్‌ చేసుకుంది. కానీ అది ఇంటర్నెట్‌లో పెద్ద రచ్చ అయ్యింది. దీనిపై నిర్మాత నాగవంశీ, హీరో విశ్వక్‌ సేన్‌ స్పందించారు. అది కావాలని, కాదు, సరదాగా తోశాడని కవర్‌ చేశారు. కానీ ఆ తేడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇది రాంగ్‌ రూట్‌లో వెళ్తుందని భావించి అంజలితో స్పందింప చేశారు. దీంతో ఆమె ట్విట్టర్‌లో ఓ పోస్ట్ పెట్టింది. 

తమ మధ్య ఎలాంటి బాండ్ ఉంటుందో తెలిపుతూ వీడియో రిలీజ్ చేసింది. తాము ఇద్దరం ఎప్పుడూ ఎంతో స్నేహంగానే ఉంటామని,  ఒకరు పట్ల మరొకరు గౌరవం ఇచ్చిపుచ్చుకునే వాళ్ళం అని తెలిపి ఈవెంట్ లో వారి మధ్య కొన్ని  మూమెంట్స్ ని వీడియో రూపంలో పోస్ట్ పెట్టింది. ఇందులో బాలయ్య ఆమెతో నవ్వుతూ మాట్లాడిన సందర్భాలూ ఉన్నాయి అలాగే ఆమెని తోసిన క్లిప్ కూడా ఉంది. మొత్తానికి బాలయ్య విషయంలో అంజలినే ఎలాంటి సమస్య లేదని ఆ వివాదానికి తెరదించే ప్రయత్నం చేసింది అంజలి. 

Latest Videos

మరోవైపు ఈవెంట్‌లో బాలయ్య మందు తాగాడనేది మరో వివాదం రాజుకుంది. వాటర్‌ బాటిల్‌ పక్కన చిన్న వాటర్‌ బాటిల్‌లో మందు ఉంది. బాలయ్య చైర్‌ దగ్గరే ఉంది. దీంతో ఈవెంట్‌లో బాలయ్య మందు తాగుతున్నారనే వివాదం రాజుకుంది. దీనిపై కూడా నిర్మాత స్పందించారు. అది సీజీలో చేశారని, కావాలని క్రియేట్‌ చేశారని కవర్ చేశారు నాగవంశీ. కానీ దానికితోడు చాలా వీడియో క్లిప్పులు రిలీజ్‌ చేస్తూ మరింత రచ్చ చేస్తున్నారు ట్రోలర్స్. 

ఈ క్రమంలో బాలకృష్ణ మరోసారి దొరికిపోయాడు. అంజలిని వెనకాల నుంచి కొట్టిన వీడియో ఇప్పుడు వైరల్‌ అవుతుంది. అదే ఈవెంట్‌లో అంజలిని హీరో విశ్వక్‌ సేన్‌ స్టేజ్‌పైకి పిలిచాడు. ఆ సమయంలో అంజలి, బాలకృష్ణ ఒకే సీట్‌లో కూర్చున్నారు. అంజలిని పిలవగానే ఆమె పైకి లేచే క్రమంలో బాలయ్య తన లెఫ్ట్ హ్యాండ్‌గా ఆమె వెనకాల భాగంలో టచ్‌ చేశాడు. ఆ సమయంలో కూడా అంజలి స్మైల్‌ ఫేస్‌తోనే వెళ్లిపోయింది. ఆ సమయలో దాన్ని ఎవరూ పట్టించుకోలేదు, కానీ ఇప్పుడు వైరల్‌గా మార్చేస్తున్నారు. 

Serious ga Balayya istham ela untadu anedi

But matter ni cover chesi inka peddadi chesthunaru

Ss rajamouli vochi cg chesada
?
pic.twitter.com/Lp99HWnziN

— 𝗞𝗜𝗥𝗔𝗡 ɴᴛʀ (@cultNTRfan9999)

నిర్మాత నాగవంశీ దాన్ని కవర్‌ చేయడంతో, ఇదేంటి మరి అని ప్రశ్నిస్తున్నారు. బాలయ్య ఎలా ఉంటాడనేది ఆయన ఇష్టం, దాన్ని ఎవరు ఎలా తీసుకుంటారనేది వారి ఇష్టం, కానీ మీరు కవర్‌ చేయడం ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. బాగా ట్రోల్‌ చేస్తున్నారు. మరి ఇది రియల్‌ వీడియోనేనా, లేక సీజీలోనే చేసిందా? అని అడుగుతున్నారు. మరి దీనిపై నాగవంశీ రియాక్ట్ అవుతాడా? అనేది చూడాలి. మొత్తానికి బాలయ్య `గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి` ఈవెంట్‌కి వచ్చిన అనేక వివాదాలకు కారణమవుతున్నారు, నిర్మాతలకు పెద్ద తలనొప్పిగా మారారని చెప్పొచ్చు. 
 

click me!