'స్పై’ లో బాలయ్య రిఫరెన్స్ ..ఎలాగంటే

Published : Jun 27, 2023, 06:50 AM IST
 'స్పై’ లో  బాలయ్య రిఫరెన్స్ ..ఎలాగంటే

సారాంశం

నిఖిల్ సిద్ధార్థ (Nikhil Siddhartha) హీరోగా తెరకెక్కిన పాన్‌ ఇండియా చిత్రం..‘స్పై’ (Spy). ఈ చిత్రం స్వాతంత్య్ర  సమరయోధుడు సుభాష్‌ చంద్రబోస్..

బాలయ్య టైమ్ మాములుగా లేదు..సీనియర్ హీరోల్లో ఒకరైన ఆయనకు ఉన్న క్రేజ్ ని అంచనా వేయటం కష్టం. మొన్న సంక్రాంతికి వీరసింహారెడ్డి అంటూ భాక్సాఫీస్ దగ్గర వీరంగం చేసారు.  అవన్ని ప్రక్కన పెడితే మీడియా రేంజి హీరోల సినిమాల్లో ఆయన ప్రస్తావన వస్తోంది. ఆ మధ్యన  ..కృష్ణగాడి వీర ప్రేమ గాధ చిత్రంలో నాని..ఆయన అభిమానిగా కనిపించాడు. ఇప్పుడు మరోసారి నిఖిల్ ...తన తాజా చిత్రంలో కనిపించి మురిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..

నిఖిల్ సిద్ధార్థ హీరోగా తెరకెక్కిన పాన్‌ ఇండియా చిత్రం..‘స్పై’ (Spy). ఈ చిత్రం స్వాతంత్య్ర  సమరయోధుడు సుభాష్‌ చంద్రబోస్‌ మరణం వెనుక దాగిన రహస్యాల ఆధారంగా తెరకెకిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి మరో ఇంట్రెస్టింగ్  విషయం బయిటకు వచ్చింది. ‘స్పై’ మూవీలో నిఖిల్ బాలయ్య( ఫ్యాన్ గా నటిస్తున్నాడని తెలుస్తోంది. అంతేకాకుంజా ఈ మూవీ లో జై బాలయ్య సాంగ్ బీట్ కూడా ఉంటుందని  టాక్ వినిపిస్తోంది.   గతంలో 'కిరాక్ పార్టీ' సినిమాలో బాలయ్య అభిమానిగా కనిపించాడు.

ఈడీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కె రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకి గ్యారీ బీహెచ్ దర్శకుడు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. జూన్ 29 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.   ఈ చిత్రంలో నిఖిల్ కు జోడీగా ఐశ్వర్య మేనన్‌  , సాన్య ఠాకూర్   హీరోయిన్లుగా  నటిస్తున్నారు. అలాగే అభినవ్ గోమఠం , ఆర్యన్ రాజేశ్ , జిస్సు సెంగుప్త , మార్కండ్ దేశ్‍పాండే తదిదరులు ఈ సినిమాలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు.  ఈ మూవీకి విశాల్ చంద్రశేఖర్ , శ్రీచరణ్ పాకాల సంయుక్తంగా సంగీతం అందిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

విజయ్, రష్మిక వెడ్డింగ్ రిసెప్షన్ లో చిరు, కేటీఆర్, నాని, వెంకీ, నాగ్ సందడి.. టాలీవుడ్ మొత్తం తరలివచ్చిందిగా
Vijay Divorce: భార్యకి విజయ్‌ రూ.250 కోట్ల భరణం.. దళపతి విడాకుల కేసులో ఊహించని ట్విస్ట్