'పేటా'లో తలైవా కొత్త గెటప్!

Published : Oct 05, 2018, 11:52 AM IST
'పేటా'లో తలైవా కొత్త గెటప్!

సారాంశం

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో 'పేటా' అనే సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. త్రిష, సిమ్రాన్ లు హీరోయిన్లుగా నటించనున్నారు.

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో 'పేటా' అనే సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. త్రిష, సిమ్రాన్ లు హీరోయిన్లుగా నటించనున్నారు. రీసెంట్ గా ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ని విడుదల చేసిన చిత్రబృందం తాజాగా ఈ సినిమాలో రజినీకాంత్ కొత్త గెటప్ ని విడుదల చేసింది.

ఫస్ట్ లుక్ లో రజినీకాంత్ మాసివ్ లుక్ తో మెప్పించగా.. తాజాగా విడుదలైన లుక్ లో మాత్రం తెల్ల చొక్కా, పెద్ద మీసాలు, బొట్టు పెట్టుకొని క్లాస్ గా కనిపించారు. దీన్ని బట్టి సినిమాలో రజినీకాంత్ పాత్రకి రెండు షేడ్స్ ఉంటాయని అర్ధమవుతుంది.

కథను బట్టి ఈ సినిమా 1980 కాలంలో సాగుతుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వారణాసిలో జరుగుతోంది. రజినీకాంత్, విజయ్ సేతుపతిలపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. 

 

 

PREV
click me!

Recommended Stories

Dhurandhar Collection: ధురంధర్‌ మూవీ ఫస్ట్‌ డే కలెక్షన్లు.. రణ్‌వీర్‌ సింగ్‌ సునామీకి బాక్సాఫీస్ షేక్
Pawan kalyan ఉదయ్ కిరణ్ కాంబినేషన్ లో మిస్సైన మల్టీ స్టారర్ మూవీ ఏదో తెలుసా?