కరీనా, సైఫ్‌లకు తారల అభినందనల వెల్లువ..

Published : Feb 22, 2021, 10:19 AM IST
కరీనా, సైఫ్‌లకు తారల అభినందనల వెల్లువ..

సారాంశం

కరీనా కపూర్‌ ఇటీవల రెండో కుమారుడికి జన్మనిచ్చింది. ఈ నెల 21ఆమెకి పండంటి మగ బిడ్డ జన్మించినట్టు కరీనా భర్త సైఫ్‌ అలీ ఖాన్‌ వెల్లడించారు. కుమారుడు, తల్లి ఆరోగ్యంగా ఉన్నట్టు వెల్లడించారు. దీంతో వరుసగా బంధువులు, సినీ వర్గాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

కరీనా కపూర్‌ ఇటీవల రెండో కుమారుడికి జన్మనిచ్చింది. ఈ నెల 21ఆమెకి పండంటి మగ బిడ్డ జన్మించినట్టు కరీనా భర్త సైఫ్‌ అలీ ఖాన్‌ వెల్లడించారు. కుమారుడు, తల్లి ఆరోగ్యంగా ఉన్నట్టు వెల్లడించారు. దీంతో వరుసగా బంధువులు, సినీ వర్గాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్‌ మీడియా అకౌంట్ల ద్వారా కరీనా, సైఫ్‌లకి విషెస్‌ తెలియజేస్తున్నారు. 

సైఫ్‌ అలీ ఖాన్‌ సిస్టర్‌.. సబా అలీ ఖాన్‌ తన ఇన్‌ స్టా స్టోరీస్‌లో కరీనా, సైఫ్‌, తైమూర్‌ అలీఖాన్‌లతోపాటు రెండో కుమారుడిని ఆహ్వానిస్తూ గ్రీటింగ్‌ని పోస్ట్ చేసి హ్యాపీ ఆంట్‌ అని పోస్ట్ పెట్టింది. మరోవైపు కరీనా కపూర్‌ కజిన్‌ సిస్టర్‌ రిద్ధిమా కపూర్‌ సహాని `కంగ్రాట్స్ లేషన్‌ బెబో అండ్‌ సైఫ్‌. ఇట్స్ ఏ బాయ్‌` అంటూ ఇన్‌ స్టా స్టోరీస్‌లో విషెస్‌ తెలిపింది.

రణ్‌బీర్‌ కపూర్‌ తల్లి నీతూ కపూర్‌ ఇన్‌స్టా స్టోరీస్‌ ద్వారా విషెస్‌ తెలియజేసింది. `కంగ్రాట్స్ సైఫ్‌, కరీనా..మీ ఫ్యామిలీలోకి మరో అడిషనల్‌ క్యూటీస్‌ వచ్చినందుకు` అని తెలిపింది.  కరీనా ఫ్రెండ్‌ నటాషా పోన్‌వాలా చెబుతూ, `హ్యపీ న్యూస్‌. నా బెస్ట్ గర్ల్స్, కూలర్‌ మామ, కరీనా పిల్లలను కనే విషయంలో అప్స్ అండ్‌ డౌన్స్ చూశావు. తల్లితనాన్ని పొందుతున్నందుకు ఆనందంగా ఉంది` అని పేర్కొంది.

ఫ్యాషన్‌ డిజైనర్‌ మనిషా మల్హోత్రా సైతం ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో అభినందనలు తెలిపారు. ఈ మేరకు కరీనా, సైఫ్‌తో కలిసి దిగిన ఫోటోని పంచుకున్నారు. కరీనా సోదరి కరిష్మా కపూర్‌ సైతం ఇన్‌స్టా స్టోరీస్‌ ద్వారా బెబోకి కంగ్రాట్స్ లేషన్స్ తెలియజేసింది. అలాగే అమృతా అరోరా సైతం అభినందనలు తెలిపింది. 2012లో సైఫ్‌, కరీనా ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. వీరికి ఇప్పటికే ఓ కుమారుడు తైమూర్‌ అలీ ఖాన్‌ జన్మించగా, ఇప్పుడు తమ లైఫ్‌లోకి రెండో కుమారుడు వచ్చాడు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss 9 Finale Voting : కళ్యాణ్ పడాల , తనూజ మధ్య అసలు పోటీ.., ఫినాలే ఓటింగ్ లో ఎవరు ముందున్నారంటే?
Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ