నాగార్జున పాటకి బాలకృష్ణ ఊరమాస్‌ డాన్స్ చూశారా? ఈ అరుదైన సందర్భానికి కారణం ఏంటంటే?

By Aithagoni Raju  |  First Published Jan 8, 2025, 6:41 PM IST

బాలకృష్ణ, వెంకటేష్‌ మధ్య గొడవలు ఉంటాయని అంటుంటారు. కానీ నాగార్జున పాటకి బాలకృష్ణ డాన్స్ చేయడం విశేషం. అది మామూలు డాన్స్ కాదు, చూస్తే అంతే. 
 


బాలకృష్ణకి, నాగార్జునకి పడదు అనే టాక్‌ ఇప్పటికీ వినిపిస్తుంది. ఆ మధ్య ఒకటి రెండు సార్లు వీరిద్దరు కలిశారు. తమ మధ్య ఏం లేదని చాటి చెప్పారు. అప్పట్లో సుబ్బిరామిరెడ్డి అవార్డు ఫంక్షన్‌లోనూ కలిసి మాట్లాడారు, ఏం లేదని చెప్పారు. కానీ ఇద్దరి మధ్య ఏదో గ్యాప్‌ కొనసాగుతూనే ఉంటుంది.ఈ ఇద్దరు కలుసుకోవడం చాలా అరుదు. 

నాగ్‌, బాలయ్య మధ్య గొడవ..

Latest Videos

అందుకే బాలయ్య, నాగ్‌ మధ్య ఏదో ఉందనే అనుమానం అందరికి కలుగుతుంది. అది ఇప్పటికీ కొనసాగుతుంది. అయితే తమ మధ్య ఏం లేదని చాటి చెప్పారు ఈ ఇద్దరు. అన్నీ మర్చిపోయి డాన్సులతో ఇరగదీశారు. నాగార్జున పాటకి బాలయ్య ఊరమాస్‌ డాన్సుతో ఇరగదీశాడు. అదిప్పుడు వైరల్‌ అవుతుంది.మరి ఈ అరుదైన సందర్భం ఎక్కడ చోటు చేసుకుంది? కారణమేంటి? అనేది చూస్తే. 

చిరంజీవి కూతురు సంగీత్‌లో టాలీవుడ్‌ బిగ్‌ స్టార్స్..

చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత సంగీత్‌ కార్యక్రమం వీడియో అంటూ ఒకటి యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతుంది. ఇందులో బిగ్‌ స్టార్స్ డాన్సులతో ఇరగదీశారు. చిరంజీవి, వెంకటేష్‌, బాలయ్య వంటి బిగ్‌ స్టార్స్ కూడా పాల్గొనడం విశేషం. చిరంజీవితోపాటు బాలయ్య, వెంకటేష్‌, నాగార్జున, శ్రీకాంత్‌, నాగబాబు, రామ్‌ చరణ్‌, అల్లు అర్జున్‌, లారెన్స్ వంటి వారు పాల్గొనడం విశేషం. వీరంతా అదిరిపోయే డాన్సులతో ఉర్రూతలూగించారు. చిరంజీవి వారిని ఎంకరేజ్‌ చేస్తూ మధ్య మధ్యలో డాన్సు చేశారు. 

నాగార్జున పాటకి బాలయ్య ఊరమాస్‌ డాన్స్..

మరోవైపు ఇందులో హైలైట్‌ ఏంటంటే నాగార్జున పాటకి బాలయ్య డాన్స్ చేయడం. నాగార్జున నటించిన `మాస్‌` సినిమాలోని `అన్న నడిచొస్తే మాస్‌` అనే పాట ఉంటుంది. దానికి బాలకృష్ణ స్టెప్పులేయడం హైలైట్‌గా నిలిచింది. అదిరిపోయే డాన్సుతో ఉర్రూతలూగించారు బాలయ్య. దీన్ని చిరు, వెంకీ, రవితేజ, లారెన్స్ సైతం ఎంకరేజ్‌ చేస్తూ హోరెత్తించారు. అంతేకాదు నాగార్జున సైతం వచ్చి బాలయ్యని కలవడం హైలైట్‌గా నిలిచింది. ఇది ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. అటు నందమూరి ఫ్యాన్స్ ని, ఇటు అక్కినేని ఫ్యాన్స్ ని అలరిస్తుంది. 

 

స్టార్‌ హీరోల మధ్య స్నేహానికి నిదర్శనం..

ఒకప్పుడు టాలీవుడ్‌లో సీనియర్‌ హీరోల మధ్య ఎంతటి స్నేహం, మంచి రిలేషన్‌ ఉందో చాటి చెప్పే వీడియో ఇది. ఎలాంటి ఈగోలు లేకుండా, డౌన్‌ టూ ఎర్త్ ఉంటూ చిన్నా పెద్ద హీరోలు అనే తేడా లేకుండా వారంతా ఆ సందర్భాన్ని ఎంజాయ్‌ చేయడం విశేషం. ఈ వీడియో ఎంతో మందికి ఇన్‌స్పైర్‌ చేసేలా ఉంది. ఇప్పుడు సోషల్‌ మీడియాలో ఫ్యాన్స్ వార్‌ తో కొట్టుకుంటున్నారు. కానీ వారి మధ్య మంచి స్నేహం ఉంటుందని, మంచి రిలేషన్‌ ఉంటుందని ఈ వీడియో చాటి చెబుతుంది. 

read more: బాలయ్యతో మా వల్ల కాదన్నారు.. `డాకు మహారాజ్‌`లో ఊర్వశి రౌతేలాని తీసుకోవడంపై నిర్మాత స్టేట్‌మెంట్‌
also read: ఆ రోల్‌కి ఎన్టీఆర్‌ సెట్ అవుతాడని బాలయ్యనే చెప్పారు.. `అన్‌స్టాపబుల్‌`లో ఎన్టీఆర్‌ అన్న ప్రస్తావనే రాలేదు

click me!