డివైడర్ ని ఢీకొట్టిన కారు...నందమూరి రామకృష్ణకు క్షణంలో తప్పిన భారీ ప్రమాదం

Published : Feb 11, 2023, 10:34 AM ISTUpdated : Feb 11, 2023, 10:45 AM IST
డివైడర్ ని ఢీకొట్టిన కారు...నందమూరి రామకృష్ణకు క్షణంలో తప్పిన భారీ ప్రమాదం

సారాంశం

అదృష్టవశాత్తు నందమూరి రామక్రిష్ణకు ఎలాంటి గాయాలు కాలేదు. కారును అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.   


  నందమూరి బాలకృష్ణ సోదరుడు నందమూరి రామకృష్ణకు తృటిలో ప్రమాదం తప్పింది. శుక్రవారం ఉదయం ఆయన తన కారును డ్రైవ్‌ చేసుకుంటూ జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌10 మీదుగా వెళ్తుండగా కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. అదృష్టవశాత్తు ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు. కారును అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.   

ఇక రీసెంట్ గా నందమూరి తారకరత్న బెంగుళూరు నారాయణ హృదయాల చేరి ట్రీట్మంట్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఆయన ఆసుపత్రిలో క్రమంగా కోలుకుంటున్నట్టుగా హీరో కళ్యాణ్ రామ్ రీసెంట్ గా అమిగోస్ ప్రెస్ మీట్ లో మాట్లాడంతో తారకరత్న ఆరోగ్యంపై అభిమానుల్లో ఆందోళన కాస్త తగ్గింది. నిన్నమొన్నటివరకు తారకరత్న ఆరోగ్యంపై రకరకాల వదంతులు వ్యాప్తి చెందాయి. మొన్న కూడా కళ్యాణ్ రామ్ డాక్టర్స్ ఏమి చెబుతున్నారో అదే నాకు తెలుసు అని అనుమానం మొలకెత్తేలా మాట్లాడడంతో అందరిలో ఆందోళన కలిగింది.
 
కానీ తాజాగా జరిగిన అమిగోస్ ప్రెస్ మీట్ లో తారకరత్నకు మెరుగైన వైద్యం అందుతుంది, ప్రస్తుతం తారకరత్న కోలుకుంటున్నాడు, అయితే ప్రెజెంట్ తారకరత్న కండిషన్ ఎలా ఉన్నదో అనేది డాక్టర్స్ మాత్రమే చెప్పగలరు, ఆ విషయాలన్నీ ఆసుపత్రి వర్గాలు చెబితే బావుంటుంది. మేమంతా తారకరత్న త్వరగా కోలుకుని మాములుగా అవ్వాలని కోరుకుంటున్నాము, అందుకు మీ ఆశీర్వాదాలు కావాలి, మీ అందరి ఆశీర్వచనాలతో త్వరగా కోలుకోవాలని కోరుకుందాము అంటూ కళ్యాణ్ రామ్ మరోసారి తారకరత్న హెల్త్ పై మాట్లాడారు.

PREV
click me!

Recommended Stories

700 కోట్లకు పైగా ఆస్తి, 10 ఏళ్ల చిన్నవాడిని పెళ్లాడిన హీరోయిన్, బెడ్ రూమ్ సీక్రేట్ వెల్లడించిన బ్యూటీ ఎవరు?
Soori Apologizes: అభిమానికి క్షమాపణ చెప్పిన కమెడియన్.. షూటింగ్ స్పాట్‌లో ఏం జరిగింది?