Unstoppable with NBK: తన భార్యకు ఫోన్ చేసి ఐలవ్యూ చెప్పిన బాలయ్య.. రానా ఎఫైర్స్ అన్నీ బయటకు లాగాడు

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jan 03, 2022, 12:59 PM IST
Unstoppable with NBK: తన భార్యకు ఫోన్ చేసి ఐలవ్యూ చెప్పిన బాలయ్య.. రానా ఎఫైర్స్ అన్నీ బయటకు లాగాడు

సారాంశం

ఆహా ఓటిటిలో నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా నిర్వహిస్తున్న 'అన్ స్టాపబుల్' షోకి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటి వరకు ఈ షోకి మోహన్ బాబు, నాని, బ్రహ్మానందం, అఖండ టీం, రాజమౌళి, రవితేజ లాంటి ప్రముఖులు హాజరయ్యారు.

ఆహా ఓటిటిలో నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా నిర్వహిస్తున్న 'అన్ స్టాపబుల్' షోకి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటి వరకు ఈ షోకి మోహన్ బాబు, నాని, బ్రహ్మానందం, అఖండ టీం, రాజమౌళి, రవితేజ లాంటి ప్రముఖులు హాజరయ్యారు. అన్ స్టాపబుల్ లో 8వ ఎపిసోడ్ లో భాగంగా ఆరడుగుల ఆజాను బాహుడు, భల్లాల దేవుడు రానా అతిథిగా హాజరయ్యాడు. 

బాలయ్యతో కలసి రానా చేసిన రచ్చ ఒక రేంజ్ లో ఉంది. తాజాగా ప్రోమో విడుదలయింది. ప్రోమో చూస్తే ఈ ఎపిసోడ్ చాలా సరదాగా సాగినట్లు అర్థం అవుతోంది. ఇద్దరూ కలసి బాగా అల్లరి చేశారు. తాను తొలిసారి టాక్ షో చేస్తున్నాను అని తెలియగానే ఎలా ఫీల్ అయ్యావు అని బాలయ్య రానాని ప్రశ్నించాడు. దీనికి రానా బదులిస్తూ.. మేమంతా నార్మల్ ట్రైన్ లో వచ్చాం.. మీరు బులెట్ ట్రైన్ లో వెళుతున్నారు అని సరదాగా కామెంట్ చేశాడు. 

ఇక బాలయ్య.. రానా పెళ్లి, ప్రేమ వ్యవహారాల గురించి ఈ షోలో ప్రశ్నించాడు. లాక్ డౌన్ టైంలో మేమంతా వ్యాక్సిన్ వస్తుంది అనుకున్నాం.. కానీ నీ పెళ్లి న్యూస్ వచ్చింది ఏంటి అని బాలయ్య ఫన్నీ కామెంట్ చేశాడు. అలాగే రానా ప్రేమ వ్యవహారాల గురించి బాలయ్య మాట్లాడుతూ.. నేనిప్పుడు ఫోన్ తీసి గూగుల్ చేశానంటే నువ్వు ఎంత మంది అమ్మాయిలకు హ్యాండ్ ఇచ్చావో ఇట్టే తెలిసిపోతుంది అని బాలయ్య అన్నారు. దీనికి రానా అదంతా వాళ్ళు ఊరకే రాశారు సర్ అని అంటాడు. 

ఇక రానా బాలయ్యకు కొన్ని ప్రశ్నలు సంధించారు. మీ భార్యతో ఆర్గుమెంట్ అయితే మొదట సారీ చెప్పేది ఎవరు అని ప్రశ్నించాడు. కృష్ణుడే సత్యభామ కళ్ళు పట్టుకున్నాడు.. ఈ బాలకృష్ణుడు ఒక లెక్కా అంటూ ఫన్నీ ఆన్సర్ తో అదరగొట్టారు. మరో ప్రశ్నగా మీరెప్పుడైనా వసుంధర గారికి ఐ లవ్యూ చెప్పారా అని ప్రశ్నించారు. దీనితో బాలయ్య వెంటనే ఫోన్ తీసుకుని ' వసు ఐలవ్యూ' అని చెప్పడంతో చప్పట్లు మారుమోగాయి. మొత్తంగా ఈ ఎపిసోడ్ ఫుల్ ఫన్ తో సాగినట్లు ఉంది. జనవరి 7న ఈ షోని ప్రసారం చేయనున్నారు. 

Also Read: Radhe Shyam: రాధే శ్యామ్ సంక్రాంతి కి వస్తుందా?... ప్రస్తుత పరిస్థితి ఇది!

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Chiranjeevi: బ్యాగ్రౌండ్ లేకుండా స్టార్ గా ఎదిగిన హీరో, అతడికి కొడుకు పుట్టగానే జాతకం చెప్పిన చిరంజీవి
Pawan Kalyan తో నటించి కనిపించకుండా పోయిన హీరోయిన్లు, లిస్ట్ లో ఐదుగురు.. ఆమె మాత్రం చేజేతులా..