
నందమూరి బాలకృష్ణ తాజాగా నటించిన చిత్రం పైసా వసూల్ ప్రమోషన్ లో బిజీబిజీగా వున్నారు. ఇప్పటికే ఆడియోకు ఆఢియెన్స్ నుంచి సూపర్ డూపర్ హిట్ స్పందన రావటంతో పాటు... ప్రమోషన్స్ పనుల్లో టీమ్ అంతా నిమగ్నమయ్యారు. అనుకున్న డేట్ కంటే ముందే రిలీజ్ చేస్తూ.. వేగంగా పూర్తి చేసినందుకు టీమ్ అంతా ఖుషీగా వుంది. ఆ ఖుషీని కంటిన్యూ చేస్తూ... బాలయ్య కూడా ఛానెల్స్ లో ఇక్కడా అక్కడా మూవీని తెగ ప్రమోట్ చేస్తున్నాడు.
ఇక ఇటీవల రేటింగ్స్ లో అదర గొడుతున్న జూనియర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ షో లాంటి చోట ప్రమోషన్ చేస్తే బాగుంటుందని నిర్మాతలు కోరారని సమాచారం. అయితే.. బిగ్ బాస్ ను కాదని బాలకృష్ణ రానా దగ్గుబాటి హోస్ట్ చేస్తున్న నెం.1 యారి కార్యక్రమంలో ప్రమోషన్ కోసం వెళ్లాడు. ఇప్పటికే బాలయ్య పాల్గొన్న కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో కూడా జెమిని టీవీ రిలీజ్ చేసేసింది.
పైసా వసూల్ సినిమా భారీ అంచనాల నడుమ సెప్టెంబర్ 1న రిలీజ్ కాబోతోంది.