రాజకీయాల్లో అమితాబ్,చిరంజీవి ఏం పీకారు.. మా బ్లడ్ వేరు

First Published Aug 31, 2017, 7:54 PM IST
Highlights
  • పైసావసూల్ సినిమా ప్రమోషన్ లో బిజీ బిజీగా బాలకృష్ణ
  • ఇంటర్వ్యూలో పనిలో పనిగా రాజకీయాల గురించి అడిగిన ఓ ఛానెల్ యాంకర్
  • రాజకీయాలంటే ఎమోషన్ కాదంటూ చిరంజీవి,అమితాబ్ లను విమర్శించిన బాలయ్య

పైసా వసూల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తోన్న బాలకృష్ణ తాజాగా ఓ మీడియా ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో  పైసా వసూల్ ప్రమోషన్ తో పాటు.. రాజకీయాలపైనా తన అభిప్రాయాలను కుండబద్ధలు కొట్టినట్లు చెప్పేశారు.

 

రాజకీయాలంటే ఆషామాషీ కాదన్నారు నందమూరి బాలకృష్ణ. సినీరంగం నుంచి రాజకీయాలకు వచ్చి సక్సెస్ కావడమంటే మామూలు విషయం కాదన్నారు. నవరసనట సార్వభౌముడు నందమూరి తారకరామారావు ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీ పెట్టి ముఖ్యమంత్రి కావడమే కాక ప్రపంచవ్యాప్తంగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న మహనీయుడన్నారు. అలాంటి సత్తా ఇప్పుడున్న సినీ హీరోల్లో లేదన్నట్టు అభిప్రాయపడ్డారు.

 

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ రాజకీయాల్లోకి వచ్చి ఏం పీ...డని అన్నారు. రాజకీయం అంటే  ఎమోషన్ కాదన్నారు. మన దగ్గర చిరంజీవి కూడా రాజకీయాల్లోకి వచ్చాడని, ఏం జరిగిందో చూశారని, ఏమీ పీ...లేక పోయాడని బాలయ్య అభిప్రాయపడ్డాడు. రాజకీయాల్లో మేం వేరని, మా కుటుంబం వేరని, మా బ్లడ్(రక్తం) వేరని బాలయ్య కుండబద్ధలు కొట్టారు.

 

అయితే ఇదంతా బాలయ్య కృష్ణ వంశీ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న రైతు సినిమాలో అమితాబ్ బచ్చన్ నటించనందుకేనని టాక్ వినిపిస్తోంది. బాలయ్య సినిమా కోసం డేట్స్ అడ్జస్ట్ కావని చెప్పిన అమితాబ్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151 చిత్రంలో మాత్రం నటిస్తుండటం విశేషం. దీన్ని మనసులో పెట్టుకునే బాలకృష్ణ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 

బాలయ్య వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ తోపాటు జనసేన అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి కేంద్ర మంత్రిగా పరిపాలించిన విషయం గుర్తుంచుకోవాలని, అంతే కాక అసలు ఇప్పుడు అధికారంలోకి వచ్చిందే పవన్ కళ్యాణ్ మద్దతుతోనని గుర్తుంచుకోవాలని గుర్తు చేస్తున్నారు.

 

click me!