
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయాలు సాధించాయి. వాటిలో ‘అఖండ’గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. నందమూరి బాలకృష్ణ టైటిల్ క్యారెక్టర్‌గా నటించిన ‘అఖండ’ డిసెంబర్ 2021లో విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసింది, అవుట్-అండ్-అవుట్ మాస్ ఎలిమెంట్స్‌తో పాటు భక్తిరస కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. థమన్ స్వరపరిచిన అద్భుతమైన సౌండ్‌ట్రాక్ ఈ చిత్రాన్ని నిలబెట్టిన బలమైన పాయింట్‌లలో ఒకటి.ఈ చిత్రాకి సీక్వెల్‌ను రూపొందించాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. పవిత్రమైన మహా శివరాత్రి రోజున, స్వరకర్త ఎస్ఎస్ థమన్ సోషల్ మీడియాలో సీక్వెల్‌ను ధృవీకరించారు. అతను ఇలా వ్రాశాడు, “దేవునిపై నమ్మకం ఉంచండి. గాడ్ బ్లెస్. త్వరలో అఖండ 2లో కలుద్దాం. అయితే ఇప్పుడు పూర్తిగా ఆ వార్తలు నిజమే అని తెలుస్తోంది.
ఈ చిత్రంలో అఘోరా క్యారెక్టర్‌లో బాలయ్య యాక్టింగ్ చూసి ఫ్యాన్స్ మాత్రమే కాకుండా అంతా షాక్ అయ్యారు. ఆ క్యారెక్టర్‌లో అయితే బాలయ్య జీవించేశారు. అయితే ఈ సినిమా బంపర్ హిట్ కొట్టినప్పటి నుంచి సీక్వెల్‌పై వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ సినిమాకు సీక్వెల్ తీసే ఆలోచన కూడా బోయపాటికి ఉందని అఖండ క్లైమాక్స్ లో చెప్పేసారు. ఈ నేపధ్యంలో బోయపాటి ఈ చిత్రానికి సరపడ కథను రెడీ చేసినట్లు సమాచారం. బాలయ్య కి చెప్పి ఓకే చేయించుకున్నట్లు సమాచారం. ఈ నేపధ్యంలో జూన్ 10, 2023న బాలయ్య పుట్టినరోజును పురస్కరించుకుని ‘అఖండ 2’ చిత్రాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారని సమాచారం.
ఇక అఖండ 2 లో రాజకీయఅంశాలే మెయిన్ హైలైట్ గా ఉంటాయంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ని టార్గెట్ చేస్తూ డైలాగులు,సీన్స్ ఉంటాయని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ ప్రచార చిత్రంగా కూడా ఈ సినిమా కలిసి రావాలని బాలయ్య చెప్పారట. ‘అఖండ 2’ సినిమాలో కూడా బాలయ్య ద్విపాత్రాభినయం చేయబోతున్నాడు. బాలయ్య చేయనున్న రెండు పాత్రల్లో చాలా వేరియేషన్స్ ఉన్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా బాలయ్య బాడీ లాంగ్వేజ్ కి సరిపడే సరికొత్త స్టోరీతో బోయపాటి ఈ సినిమా కథని ప్లాన్ చేశాడట. అఖండ సీక్వెల్ కావడంతో.. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉంటాయి. బోయపాటి శ్రీను ప్రస్తుతం హీరో రామ్ తో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తుండగా, బోయపాటి రామ్ పోతినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత బోయపాటి- బాలయ్య కలిసి అఖండ-2ను పట్టాలెక్కించే అవకాశం ఉందని టాక్. ఇదే నిజమైతే బాలయ్య ఫ్యాన్స్‌కు ఇక పండగే.అఖండ-2పై ఫ్యాన్స్‌కు భారీ అంచనాలే ఉన్నాయి.