‘డెవిల్’కథ నేతాజీ డెత్ మిస్టరీతో లింక్, బెంగాళీ సినిమా ఆధారమా?

Published : Apr 11, 2023, 03:07 PM IST
 ‘డెవిల్’కథ నేతాజీ డెత్ మిస్టరీతో లింక్, బెంగాళీ సినిమా ఆధారమా?

సారాంశం

. 1945 బ్రిటిష్ కాలంలో జరిగిన రియల్‌ ఇన్సిడెంట్స్‌ ఆధారంగా ఈ కథను రెడీ చేశారట మేకర్స్. ఇందులో బ్రిటీష్‌ సీక్రెట్‌ ఏజెంట్‌గా కళ్యాణ్ రామ్ కనిపించనున్నారని, ఆయన చేసే సాహసాలు అబ్బురపరుస్తాయని తెలుస్తోంది.


కళ్యాణ్ రామ్ హీరోగా  భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం డెవిల్. ఇప్పటివరకు కళ్యాణ్ రామ్ కెరీర్ లో హయ్యెస్ట్ బడ్జెట్ తో రూపొందిన మూవీ అంటే బింబిసార మాత్రమే . ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్ల పైనే గ్రాస్ వసూళ్లను సాధించి కళ్యాణ్ రామ్ కు మంచి మార్కెట్ ఏర్పడేలా చేసింది. నిర్మాతలకు కూడా కళ్యాణ్ రామ్ సినిమా పై మంచి బడ్జెట్ పెట్టొచ్చు అనే నమ్మకాన్ని కల్పించిందీ సినిమా.

అయితే బింబిసార సినిమా స్టార్ట్ అవ్వడానికి ముందే ‘డెవిల్’ అనే సినిమాని స్టార్ట్ చేశారు అభిషేక్ నామా. కథ పై ఆయనకు అంత నమ్మకం ఉందని ఇటీవల రావణాసుర ప్రమోషన్లలో ఆయన చెప్పుకొచ్చారు. ఈ నేపధ్యంలో  ‘డెవిల్’ కథ గురించిన ఓ విషయం బయిటకు వచ్చి హాట్ టాపిక్ గా మారింది. అదేమిటంటే ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ ..సీక్రెట్ ఏజెంట్ గా కనిపిస్తారు. అలాగే ఈ కథలో ప్రధానాంశం సుభాష్ చంద్ర బోస్ మృతి లేదా అదృశ్యానికి సంభందించింది అని తెలుస్తోంది. . 1945 బ్రిటిష్ కాలంలో జరిగిన రియల్‌ ఇన్సిడెంట్స్‌ ఆధారంగా ఈ కథను రెడీ చేశారట మేకర్స్. ఇందులో బ్రిటీష్‌ సీక్రెట్‌ ఏజెంట్‌గా కళ్యాణ్ రామ్ కనిపించనున్నారని, ఆయన చేసే సాహసాలు అబ్బురపరుస్తాయని తెలుస్తోంది.

నేతాజీ సుభాష్ చంద్రబోస్...  18 ఆగష్టు 1945న మృతి చెందారు. అయితే ఇప్పటికీ సుభాష్ చంద్రబోస్ ఎలా మృతి చెందాడు అన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతుండగా... అసలు బోస్ మరణించలేదనే వాదన కూడా ఉంది. సుభాష్ చంద్రబోస్ తైపేలో విమానం కూలడంతో మృతి చెందాడని ప్రపంచానికి తెలుసు. అయితే అది నిజం కాదని చాలామంది అంటూంటారు. అయితే అసలు మిస్టరీ ఏంటి..? అనే పాయింట్ ని డెవిల్ చిత్రంలో ప్రస్దావిస్తున్నారని సమాచారం.

75 ఏళ్లు గడిచినప్పటికీ నేతాజీ మృతి మాత్రం ఇంకా వీడని మిస్టరీగానే మిగిలిపోయింది. నేతాజీ మృతిపై జస్టిస్ ముఖర్జీతో వేసిన ఏకసభ్య విచారణ కమిటీ కూడా 2005లో ఓ నివేదిక సమర్పించింది. అందులో కూడా సుభాష్ చంద్రబోస్ విమాన ప్రమాదంలో మరణించలేదని పేర్కొంది. అయితే తాజాగా నేతాజీ మనవళ్లు మనవరాండ్రు మాత్రం తమ తాతయ్య విమాన ప్రమాదంలోనే మృతి చెందారంటూ చెప్పుకొచ్చారు. అయితే నేతాజీ మాత్రం ఉత్తర్ ప్రదేశ్‌లోని ఫైజాబాద్‌లో గుమ్నామీ బాబాగా బతికే ఉన్నారంటూ కొన్ని వార్తలు వచ్చాయి. దీనిపై బెంగాల్‌లో సినిమా కూడా వచ్చింది. ఆ సినిమా బేస్ చేసుకునే డెవిల్ తెరకెక్కుతోందనే వాదన వినిపిస్తోంది. మొన్న రావణాసుర చిత్రానికి కథ ఇచ్చిన శ్రీకాంత్ విస్సా ఈ చిత్రానికి కథ అందించారు. రావణాసుర సైతం విన్సి డా అనే బెంగాళీ చిత్రం ఆధారంగా తెరకెక్కింది. 
 
అభిషేక్ నామా మాట్లాడుతూ..’ కళ్యాణ్ రామ్ గారికి అంత బడ్జెట్ పెట్టడానికి నేను ముందుకు రావడం వెనుక డెవిల్ కథ పుషింగ్ ఉంది తప్ప ఇంకేమీ కాదు. ఆ సినిమా చాలా బాగా వచ్చింది. డెవిల్ కి సీక్వెల్ కూడా ఉంటుంది. అది కూడా త్వరలో అనౌన్స్ చేస్తాం. లేదంటే డెవిల్ రిలీజ్ టైంలో అనౌన్స్ చేస్తామని చెప్పారు. ఇక డెవిల్ సినిమాలో బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ గా కళ్యాణ్ రామ్ కనిపిస్తాడని తెలుస్తుంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ మూవీ రిలీజ్ కాబోతోంది.

PREV
click me!

Recommended Stories

Aadarsha Kutumbam: వెంకటేష్‌ హౌజ్‌ నెంబర్‌ బయటపెట్టిన త్రివిక్రమ్‌.. చాలా ఆదర్శ కుటుంబం
సుమ కు బాలకృష్ణ భారీ షాక్, అఖండ 2 దెబ్బకు 14 సినిమాలు గల్లంతు..?