Balakrishna Action: రామ్,లక్ష్మన్ లను రంగంలోకి దింపిన బాలయ్య...

Published : Feb 19, 2022, 06:45 AM IST
Balakrishna Action: రామ్,లక్ష్మన్ లను రంగంలోకి దింపిన బాలయ్య...

సారాంశం

బాలయ్య (Balakrishna) దూకుడు మమూలుగా లేదు. ఏమాత్రం తగ్గేదే లేదు అంటున్నాడు. వరుస సినిమాలు సెట్స్ ఎక్కిస్తున్న బాలకృష్ణ(Balakrishna).. యాక్షన్ డోస్ ఇంకాస్త పెంచాడు.

బాలయ్య (Balakrishna) దూకుడు మమూలుగా లేదు. ఏమాత్రం తగ్గేదే లేదు అంటున్నాడు. వరుస సినిమాలు సెట్స్ ఎక్కిస్తున్న బాలకృష్ణ(Balakrishna).. యాక్షన్ డోస్ ఇంకాస్త పెంచాడు.

రీసెంట్ గా అఖండ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న బాలకృష్ణ (Balakrishna) నెక్ట్స్ సినిమాలమీద దృష్టి పెట్టారు.అందులో బాగంగానే బాలయ్య బాబు హీరోగా మలినేని గోపీచంద్ డైరెక్షన్ లో ఓ సినిమా రూపొందుతోంది. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈమూవీని మైత్రీ మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి. అయితే ఈమూవీ రెగ్యూలర్  షూటింగ్ నిన్న(ఫిబ్రవరి 18) సిరిసిల్లలో స్టార్ట్ అయ్యింది. అది కూడా భారీ యాక్షన్ సీన్స్ తో షూటింగ్ ను మొదలు పెట్టినట్టు తెలుస్తోంది.

ఇక ఈ సినిమాకి యాక్షన్ సీక్వెన్స్ లకోసం  రామ్ – లక్ష్మణ్ (Ram, Lakshman) ని రంగంలోకి దింపారు మేకర్స్.  యాక్షన్ సీన్ గురించి వారు దర్శకుడు గోపీచంద్ మలినేనితో మాట్లాడుతున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గోపీచంద్ మలినేని  డైరెక్షన్ లో  ఇంతకు ముందు వచ్చిన హిట్ మూవీ క్రాక్ కి కూడా  రామ్ – లక్ష్మణ్ స్పెషల్ గా  కంపోజ్ చేసిన ఫైట్స్ హైలైట్ గా నిలిచాయి. దాంతో ఈ సినిమాకు కూడా వీళ్ళనే తీసుకోవాలి నిర్ణయించారు టీమ్.

ఇక రామ్ - లక్ష్మణ్ యాక్షన్ సీన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారీస్థాయిలో ప్లాన్ చేయడంతో వాళ్ళ తరువాతే. యాక్షన్ సీక్వెన్స్ లలో మాస్ కా బాబ్ అనిపించుకునే బాలయ్య(Balakrishna) తో ఎలాంటి యాక్షన్ సీన్స్ చేయిస్తారా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అఖండతో బాలకృష్ణను మెప్పించిన తమన్, ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీలో బాలయ్య జోడీగా శ్రుతి హాసన్ నటిస్తుంది. ఇక మరో కోలీవుడ్ హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ నెగెటీవ్ రోల్ లో  కనిపించనుంది.

PREV
click me!

Recommended Stories

Bigg Boss 9: పాపం ఇమ్మాన్యుయల్... టాప్ 3 కూడా మిస్, ఖుషీలో డీమాన్ పవన్
Sanjana Eliminated : బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే రేసు నుంచి సంజన ఔట్, నలుగురిలో నెక్స్ట్ ఎలిమినేషన్ ఎవరంటే?