
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్, ఉపాసన దంపతులు పెళ్లైన పదకొండేళ్లకి పేరెంట్స్ గా ప్రమోట్ అయ్యారు. ఈ రోజు మంగళవారం(జూన్ 20) తెల్లవారుజామున ఉపాసన పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చింది. దీంతో మెగా ఫ్యామిలీలో ఆనందాలు వెల్లువిరిశాయి. ఇన్నాళ్ల తర్వాత చరణ్ తండ్రి కావడం, మెగా ఫ్యామిలీలోకి వారసుడు రావడంతో చిరంజీవి, సురేఖల ఆనందానికి అవదుల్లేవని చెప్పొచ్చు. తాము గ్రాండ్ పేరెంట్స్ అయినందుకు వారు ఫుల్ ఖుషీగా ఉన్నారు. దీంతో మెగా ఫ్యామిలీలో ఓ పండగ వాతావరణం నెలకొంది. `మెగా ప్రిన్సెన్స్` ని ఆహ్వానిస్తూ, చరణ్, ఉపాసన, చిరులకు అభినందనలు తెలియజేస్తూ విషెస్‌ల వెల్లువ విరుస్తుంది.
ఇప్పటికే ఎన్టీఆర్, శర్వానంద్ వంటి చాలా మంది స్టార్స్ విషెస్ తెలియజేశారు. చిరంజీవి తన ఆనందాన్ని పంచుకుంటూ ట్వీట్ చేశారు. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ట్వీట్టర్ ద్వారా విషెస్ చెప్పారు. ఇప్పటికే వారు అపోలో ఆసుపత్రిలో ఉపాసన, చిన్నారిని లను పరామర్శించారు. తమ సంతోషాన్ని పంచుకున్నారు. మరోవైపు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో కూడా తమ ఆనందాన్ని తెలియజేశారు.
తాజాగా బన్నీ తన ట్వీట్‌లో చెబుతూ, బంగారు హృదయం కలిగిన నా స్వీటెస్ట్ బ్రదర్ రామ్‌చరణ్‌కి, నా ప్రియమైన దయగల మహిళ ఉపాసన లకు నా హృదయపూర్వక అభినందనలు. విలువైన కొత్త రాక కోసం నా అభినందనలు తెలియజేస్తున్నా. గర్వించదగిన గ్రాండ్ పేరెంట్స్ చిరంజీవి, సురేఖ ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది` అంటూ మెగా ప్రిన్సెస్ యాష్ ట్యాగ్‌ని పంచుకున్నారు బన్నీ. మెగా ప్రిన్సెస్‌కి ఆయన స్వాతగం పలుకుతూ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.
ఇదిలా ఉంటే బన్నీకి, చరణ్ కి మధ్య కొంత గ్యాప్ వచ్చిందనే రూమర్స్ కొంత కాలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ట్వీట్‌తో అన్ని రూమర్లు పటాపంచల్ అయ్యాయని చెప్పొచ్చు. ప్రస్తుతం బన్నీ `పుష్ప2` చిత్రంతో బిజీగా ఉన్నారు. సుకుమార్ దర్శకత్వం వహిస్తుండగా, రష్మిక కథానాయికగా నటిస్తుంది. ఇది శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. మరోవైపు చరణ్ `గేమ్ ఛేంజర్`లో నటిస్తున్నారు. దీనికి శంకర్ దర్శకుడు. కియారా అద్వానీ కథానాయిక. ఈ సినిమా షూటింగ్‌ని కొన్ని రోజులు వాయిదా వేశారు.