ప్రపంచ వ్యాప్తంగా 9వేల థియేటర్లలో బాహుబలి విడుదల

Published : Apr 25, 2017, 11:17 AM ISTUpdated : Mar 26, 2018, 12:01 AM IST
ప్రపంచ వ్యాప్తంగా 9వేల థియేటర్లలో బాహుబలి విడుదల

సారాంశం

ఏప్రిల్ 28న బాహుబలి2 విడుదల దేశవ్తాప్తంగా బాహుబలి ఫీవర్ ప్రపంచవ్యాప్తంగా 9వేల థియేటర్లలో బాహుబలి

తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయిలో కీర్తింపబడేలా చేసిన చిత్రం బాహుబలి2. ఈ  సినిమా ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది బాహుబలి – 2 రిలీజ్ సందడి. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా బాహుబలి2 ఫీవర్ మొదలైంది. కేవలం మూడు రోజులే ఉండటంతో టికెట్స్ కోసం జనం నానా హడావిడి చేస్తున్నారు.

 

ఇక బాహుబలి2ను ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషలలో రిలీజ్ చేస్తున్నారు. మొత్తం 9000 థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. మరే భారతీయ సినిమాకు దక్కని అరుదైన గౌరవం ఇది. ఇప్పటి వరకు ఇన్ని థియేటర్లలో ఏ సినిమా రిలీజ్ కాలేదు. దేశవ్యాప్తంగా 6500 థియేటర్లలో రిలీజ్ కానుంది. అటు ఓవర్సీస్ లోనూ… సత్తా చాటుతోంది బాహుబలి. ఒక్క అమెరికాలోనే 1100 థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. కెనడాలో 150 థియేటర్లలో రిలీజ్ కానుంది. అమెరికా, కెనడాలలో ఐమ్యాక్స్ ఫార్మాట్ లో రిలీజ్ అవుతున్న తొలి సినిమా ఇది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఫీజి, మలేషియాలలో సినిమా రిలీజ్ అవ్వనుంది. యూకే ఇండియా ఇయర్ ఆఫ్ కల్చరల్ ఈవెంట్ లో ఈ సినిమా ప్రిమీయర్ ను ప్రదర్శించనున్నారు.

 

అటు కర్నాటకలోనూ బాహుబలి రిలీజ్ కు అడ్డంకులు తొలగాయి. బాహుబలి ‘కట్టప్ప’ సత్యరాజ్ కావేరీ వివాదంపై క్షమాపణలు చెప్పడంతో కర్నాటక సంస్థలు విడుదలకు ఓకే చెప్పాయి. అడ్వాన్స్ బుకింగ్ లు కూడా ప్రారంభమయ్యాయి. అలా ఇప్పుడు దేశవ్యాప్తంగా బాహుబలి ఫీవర్ తో జనం సందడి చేస్తున్నారు.. సాహో రే బాహుబలి.

PREV
click me!

Recommended Stories

IMDb రిపోర్ట్ ప్రకారం 2025 లో టాప్ 10 పాపులర్ సినిమాలు ఏవంటే?
Akhanda 2 Premiers: అఖండ 2 చిత్రానికి మరో కోలుకోలేని దెబ్బ.. ప్రీమియర్ షోల అనుమతి రద్దు చేసిన హైకోర్టు