సమంత, నాగచైతన్యల ప్రేమ ఒక రేంజ్ లో పండుతోంది

First Published Apr 24, 2017, 1:53 PM IST
Highlights
  • సమంత, నాగచైతన్యల ప్రేమ ఒక రేంజ్ లో పండుతోంది
  • సమంత కోసం నాగచైతన్య దోసె ఛాలెంజ్

ఇటీవల టాలీవుడ్ ప్రేమ జంటల్లో ముఖ్యంగా కనిపిస్తున్నది నాగచైతన్య, సమంతలే. ప్రేమికులు ఎలా వుండాలనేది వీరిద్దరూ తమ చేష్టలతో చూపిస్తున్నారు. అయిదేళ్ల పాటు ప్రేమించుకుని, చివరకు పెద్దల అంగీకారం పొంది, ఒకరికి ఒకరు సరిజోడి అని నిర్ధారించుకుని, ఎంగేజ్ మెంట్ చేసుకు త్వరలో పెళ్లికి సిద్ధమవుతోన్న ఈ సెలబ్రిటీ జంట తీరిక సమయాల్లో ఎంత జాలీగా గడుపుతారనేది సమంత సోషల్ మీడియాలో చేసిన పోస్ట్‌ లతోనే తెలుస్తోంది.

 

ఇద్దరి మధ్య వున్న ప్రేమ ఎంత గాఢంగా ఉందో తాజాగా రిలీజ్ చేసిన ఫోటోల్లోనూ కనిపిస్తోంది. ప్రతి పండగని, పుట్టినరోజుని అద్భుతంగా సెలబ్రేట్‌ చేసుకునే ఈ జంట ఫ్యామిలీకి, ఫ్రెండ్స్‌కీ అప్పుడప్పుడూ పార్టీలిస్తూ వుంటుంది. ఈ జంటని చూసిన వాళ్లంతా లవర్స్‌ అంటే వీళ్లలాగే వుండాలని అంటున్నారు. 



షూటింగ్‌ లేకపోతే ఇద్దరూ కలిసే వుంటారు తప్ప వేర్వేరు వ్యాపకాలేమీ పెట్టుకోరు. సమంత కోసం చైతన్య షెఫ్ అవతారం ఎత్తుతాడు. అతని కోసం ఆమె ఏదైనా చేసేస్తుంటుంది. ఎంత హీరో అయినా ప్రేయసి కోసం వండి పెడితే వుండే ఆనందమేంటనేది చైతన్య చేసి చూపిస్తున్నాడు. సమంత కోసం చైతన్య దోసె ఛాలెంజ్ చేసాడు. ఈతరం ప్రేమికులు అందరికీ వీరిద్దరూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఏదేమైనా ఈ జంటను చూస్తే చూడముచ్చటగా ఉన్నారు.

click me!