థియేటర్‌లోకి మరోసారి `బాహుబలి'..ఆ మ్యాజిక్‌ వర్కౌట్‌ అవుతుందా?

Published : Nov 05, 2020, 07:36 AM ISTUpdated : Nov 05, 2020, 07:40 AM IST
థియేటర్‌లోకి మరోసారి `బాహుబలి'..ఆ మ్యాజిక్‌ వర్కౌట్‌ అవుతుందా?

సారాంశం

`బాహుబలి` మళ్ళీ తెరపైకి రాబోతుంది. ఈ శుక్రవారం మొదటి భాగం, వచ్చే శుక్రవారం రెండో భాగం విడుదల కానున్నాయి. అయితే ఇది హిందీలో కావడం విశేషం. కరోనా వల్ల గత ఏడు నెలలుగా థియేటర్లు మూత పడ్డ విషయం తెలిసిందే. 

`బాహుబలి` ఇండియన్‌ సినిమా సత్తాని ప్రపంచానికి చాటి చెప్పిన సినిమా. ముఖ్యంగా తెలుగు సినిమా పవర్‌ ఏంటో రుచిచూపించిన చిత్రం. ఇండియన్‌ బాక్సాఫీస్‌ని షేక్‌ చేసిన చిత్రం. తెలుగు సినిమాకి జాతీయ అవార్డుని తీసుకొచ్చిన సినిమా. పాన్‌ ఇండియా సినిమా ట్రెండ్‌ని క్రియేట్‌ చేసిన సినిమా. మొత్తంగా అదో సంచలనం. ఇది విదేశాల్లోనూ రికార్డు కలెక్షన్లు వసూలు చేసి ఆకట్టుకుంది. 

తాజాగా ఈ సినిమా మళ్ళీ తెరపైకి రాబోతుంది. ఈ శుక్రవారం మొదటి భాగం, వచ్చే శుక్రవారం రెండో భాగం విడుదల కానున్నాయి. అయితే ఇది హిందీలో కావడం విశేషం. కరోనా వల్ల గత ఏడు నెలలుగా థియేటర్లు మూత పడ్డ విషయం తెలిసిందే. అయితే ఇటీవల కేంద్రం థియేటర్లు ఓపెన్‌ చేసుకునేందుకు అనుమతిచ్చింది. కంటైన్‌మెంట్‌ జోన్లలో కాకుండా ఇతర ప్రాంతాల్లో థియేటర్లు 50శాతం ఆడియెన్స్  ఆక్యుపెన్సీతో నడుపుకోవచ్చని, సినిమాలను విడుదల చేసుకోవచ్చని ప్రభుత్వం వెల్లడించింది. 

గత నెల 15 నుంచే ప్రభుత్వం అనుమతి అమల్లోకి రాగా.. ఓపెన్‌ చేసేందుకు ఎగ్జిబిటర్లు ముందుకురాలేదు. కొన్ని చోట్లు ఓపెన్‌ అయినా ఆడియెన్స్ రావడం లేదు. ఇక మహారాష్ట్ర ప్రభుత్వం ధైర్యం చేసింది. థియేటర్లు ఓపెన్‌ చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో నేటి నుంచి థియేటర్లని ఓపెన్‌ చేసుకునే అవకాశం కల్పించింది. అయితే ప్రారంభించిన వెంటనే థియేటర్‌కి వచ్చేందుకు ఆడియెన్స్ సిద్ధంగా లేరు. వారికి కాస్త టైమ్‌ కావాలి. పైగా పెద్ద సినిమాలు విడుదలయ్యే ఛాన్స్ లేదు. ఈ నేపథ్యంలో థియేటర్లకు జనాన్ని రప్పించేందుకు హిందీ ఎగ్జిబిటర్లు ఓ ప్లాన్‌ వేశారు. ఇండియాలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన `బాహుబలి` సినిమాని విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ శుక్రవారం మొదటి భాగాన్ని విడుదల చేయనున్నారు. వచ్చే శుక్రవాం రెండో భాగం విడుదల చేయనున్నట్టు ఈ చిత్రాల నిర్మాత కరణ్‌ జోహార్‌ నిర్ణయించారు. ఈ విషయాన్ని సినీ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ వెల్లడించారు. దీంతో ఈ అద్భుతాన్ని మరోసారి వెండితెరపై చూడొచ్చని అభిమానులు ఖుషీ అవుతున్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Actor Sivaji: మహిళా కమిషన్‌ దెబ్బకి దిగొచ్చిన శివాజీ.. స్త్రీ అంటే మహాశక్తితో సమానం అంటూ క్షమాపణలు
Emmanuel కి బిగ్‌ బాస్‌ తెలుగు 9 ట్రోఫీ మిస్‌ కావడానికి కారణం ఇదే.. చేసిన మిస్టేక్‌ ఏంటంటే?