అరియానా కోసం సోహైల్‌ కాళ్ళ మీద పడ్డ అవినాష్‌..

Published : Nov 05, 2020, 12:17 AM ISTUpdated : Nov 05, 2020, 07:05 AM IST
అరియానా కోసం సోహైల్‌ కాళ్ళ మీద పడ్డ అవినాష్‌..

సారాంశం

అవినాష్ రంగ పాత్రలో ఈ టాస్క్‌లో పాన్ షాప్ ఓనర్‌గా కనిపించాడు. ఊరి పెద్ద అయిన సోహెల్ కూతురుగా అరియానా వెంకట లక్ష్మీ పాత్రలో కనిపించింది.  ఇక అవినాష్ అరియానాతో సరసాలు ఆడటంతో చూసి సోహెల్ ఫైర్ అయ్యాడు.

బుధవారం కెప్టెన్సీ టాస్క్ ఆద్యంతం ఆసక్తిని రేకెత్తిస్తుంది. పల్లెకు పోదాం ఛలో ఛలో.. అనే కార్యక్రమం పెట్టాడు బిగ్‌బాస్‌. ఈ కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా `పల్లెకు పోదాం ఛలో ఛాలో..` అంటూ `రంగస్థలం` అనే ఊరిగా మార్చేశాడు. ఆ ఊరి పెద్దగా సోహెల్, అతని భార్యగా లాస్య నటించింది.  ఊరి పెద్ద భార్యను పడగొట్టేందుకు ప్రయత్నించే పాత్రలో అమ్మ రాజశేఖర్ కనిపించాడు. 

అవినాష్ రంగ పాత్రలో ఈ టాస్క్‌లో పాన్ షాప్ ఓనర్‌గా కనిపించాడు. ఊరి పెద్ద అయిన సోహెల్ కూతురుగా అరియానా వెంకట లక్ష్మీ పాత్రలో కనిపించింది.  ఇక అవినాష్ అరియానాతో సరసాలు ఆడటం చూసి సోహెల్ ఫైర్ అయ్యాడు. తనకు మీ కూతురు కావాలని కన్నీళ్లు పెట్టుకున్నాడు అవినాష్‌. అందు కోసం సోహైల్‌ కాళ్ల మీద పడ్డాడు. అయినా చిరాకు పడుతూ ఊరిపెద్ద వెళ్లిపోయాడు. కానీ‌ అరియానా మాత్రం అవినాష్‌ కోసం ఎదురుచూడటం ఆసక్తిగా మారింది. మరోవైపు ఊర్లో పుకార్లు సృష్టిస్తూ, ఐటెమ్‌ గర్ల్ గా నటించిన హారిక తెగ ప్రేమిస్తున్నాడు రౌడీ మెహబూబ్‌. ఇలాంటి ఆసక్తికర సన్నివేశాలతో బిగ్‌బాస్‌ 59వ ఎపిసోడ్‌ సాగింది. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

5000 తో ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చింది, ప్రస్తుతం 5 నిమిషాలకు 3 కోట్లు వసూలు చేస్తున్న హీరోయిన్ ఎవరో తెలుసా?
Actor Sivaji: మహిళా కమిషన్‌ దెబ్బకి దిగొచ్చిన శివాజీ.. స్త్రీ అంటే మహాశక్తితో సమానం అంటూ క్షమాపణలు