అఖిల్‌ హ్యాండివ్వడంతో.. అభిజిత్‌ చెంతకు చేరిన మోనాల్‌..మళ్ళీ రొమాన్స్ షురూ!

Published : Nov 04, 2020, 11:34 PM IST
అఖిల్‌ హ్యాండివ్వడంతో.. అభిజిత్‌ చెంతకు చేరిన మోనాల్‌..మళ్ళీ రొమాన్స్ షురూ!

సారాంశం

అఖిల్‌.. అడ్డంగా హ్యాండివ్వడంతో షాక్‌లోకి వెళ్ళిన మోనాల్‌ ఓదార్పు కోరుకుంది. అది అభిజిత్‌ ఇచ్చేందుకు రెడీగా ఉన్నాడు. అంతేకాదు మళ్ళీ మొదటి రోజులకు వెళ్లిపోయారీ మాజీ ప్రేమ పక్షులు.

తొమ్మిదో వారం నామినేషన్‌లో మోనాల్‌ని నామినేట్‌ చేసి షాక్‌ ఇచ్చాడు అఖిల్‌. గేమ్‌పై దృష్టి లేదని, క్లారిటీ లేదని, అలాంటప్పుడు హౌజ్‌లో ఉండే అర్హత లేదని అఖిల్‌ స్పష్టం చేశారు. దీంతో మోనాల్‌ తీవ్రంగా హర్ట్ అయ్యింది. తన జడ్జ్ మెంట్‌ రాంగ్‌ అని వాపోయింది. అంతేకాదు ఇప్పుడు తన రూట్‌ మార్చింది. అఖిల్‌ని దూరం పెట్టడం ప్రారంభించింది. క్రమంగా అభిజిత్‌ చెంతకు చేరుతుంది. 

అఖిల్‌.. అడ్డంగా హ్యాండివ్వడంతో షాక్‌లోకి వెళ్ళిన మోనాల్‌ ఓదార్పు కోరుకుంది. అది అభిజిత్‌ ఇచ్చేందుకు రెడీగా ఉన్నాడు. అంతేకాదు మళ్ళీ మొదటి రోజులకు వెళ్లిపోయారీ మాజీ ప్రేమ పక్షులు. బుధవారం ఎపిసోడ్‌లో మోనాల్-అభిజిత్‌లు ఇద్దరూ సోఫాలో కూర్చుని ముచ్చట్లు పెట్టారు.  `అసలు నిన్ను ఎందుకు టార్గెట్ చేశారు అందరూ` అంటూ మోనాల్ ని ఉదార్చే ప్రయత్నం చేశాడు అభిజిత్‌. ఈ వారం వాళ్ళు నిన్ను ఎందుకు టార్గెట్‌ చేశారని అడిగాడు. 

అందుకు మోనాల్‌ స్పందిస్తూ, `వాళ్ల అభిప్రాయంలోనే నేను వీక్. గివ్ అప్ ఇస్తానని వాళ్ల ఉద్దేశం. అది నిజమే. నేను మిస్టరీ గర్ల్‌ని అందుకే` అని చెప్పింది మోనాల్. ఈ టైమ్‌లోనే పులిహోర కలపడం ప్రారంభించాడు అభిజిత్‌. వాళ్ళలా తాను చేయనని చెప్పాడు. `ఎంతైనా ఆడపిల్లవి కదా, అని చూడలేదు. నాకు అది నచ్చలేదు` అని ఆమెని ఓదార్చే ప్రయత్నం చేశాడు. మొత్తానికి మరోసారి కొత్త రొమాన్స్ కి తెరలేపారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

5000 తో ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చింది, ప్రస్తుతం 5 నిమిషాలకు 3 కోట్లు వసూలు చేస్తున్న హీరోయిన్ ఎవరో తెలుసా?
Actor Sivaji: మహిళా కమిషన్‌ దెబ్బకి దిగొచ్చిన శివాజీ.. స్త్రీ అంటే మహాశక్తితో సమానం అంటూ క్షమాపణలు