బాహుబలి క్రేజ్ భల్లాలదేవుడికి దక్కలేదా..

Published : Feb 19, 2017, 08:37 AM ISTUpdated : Mar 25, 2018, 11:37 PM IST
బాహుబలి క్రేజ్ భల్లాలదేవుడికి దక్కలేదా..

సారాంశం

బాహుబలిలో భల్లాలదేవుడిగా  నటించిన రానా బాహుబలి తర్వాత రిలీజైన రానా ఫస్ట్ మూవీ ఘాజీ ఘాజీలో హీరో రానా ఎంట్రీకి కనిపించని స్పందన బాహుబలి క్రేజ్ రానాకు దక్కినట్టా..లేదా అర్థంకాని స్థితి 

బాహుబలి సినిమాలో రాణా తెరపై కనిపించినపుడు ఈలలతో థియేటర్లు దద్ధరిల్లాయి. బళ్లాలదేవుడిగా రాణాని అమితంగా ఇష్టపడ్డ ప్రేక్షక లోకం అతడిని తర్వాత కూడా అలాగే ఆదరిస్తుందని, అతను కనిపిస్తే అదే స్థాయిలో అంతా స్పందిస్తారని దగ్గుబాటి ఫ్యామిలీ  ఆశించింది. కానీ 'ఘాజీ' చిత్రానికి వచ్చిన ఓపెనింగ్స్ ఓకే అనిపించినా ఈ చిత్రంలో రాణా తెరపై కనిపించినప్పుడు ప్రేక్షకుల నుంచి వస్తోన్న స్పందన అంచనాలకి తగ్గట్టు లేదు.

 

ఘాజీలో రాణా ఎంట్రన్స్‌ సీన్‌కి థియేటర్స్‌లో అసలు రెస్పాన్స్‌ రాకపోవడం ఆశ్చర్యకరం. ఒక స్టార్ హీరో కనిపించాడనే ఉత్సాహమే ప్రేక్షకుల్లో కనిపించడం లేదు. దీనిని బట్టి 'బాహుబలి'తో రాణాకి వచ్చిన స్టార్‌డమ్‌ ఆ సినిమా వరకే పరిమితమైందా అనే సందేహం కలుగుతోంది. ప్రభాస్‌ మార్కెట్‌ ఏమో యాభై నుంచి ఒకేసారి వంద కోట్లకి డబుల్‌ అయితే రానాకి మాత్రం ఎందుకో ఆ స్థాయిలో హెల్ప్‌ అవలేదు. 

బహుశా రానా కొద్ది రోజుల పాటు మాస్‌ సినిమాలపై దృష్టి పెడితే మంచిదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ కథలపై ఫోకస్‌ పెడితే ఇమేజ్‌ అంటూ వస్తుందని, హీరో ఇమేజ్ తెచ్చిపెట్టలేని కథల వల్ల స్టార్‌డమ్‌ వచ్చే అవకాశం లేదని అంటున్నారు. మరి రానాకి స్టార్‌డమ్‌ కావాలా వద్దా అనేది తనే తేల్చుకోవాలి.

PREV
click me!

Recommended Stories

Gunde Ninda Gudi Gantalu Today: బాలు పై బయటపడిన ప్రభావతి ప్రేమ, చిటికెలు వేసి మరీ శపథం చేసిన మీన
2025 Flop Movies: 100 కోట్లు దాటినా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌ అయిన 8 సినిమాలు