
అల్లు అర్జున నటిస్తున్న తాజా చిత్రం డీజే దువ్వాడ జగన్నాథం. ఈ సినిమా షూటింగ్ ప్రస్థుతం కర్ణాటకలోని ప్రముఖ దేవాలయమైన చెన్నకేశవాలయంలో జరుగుతోంది. హరీష్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం బేలూరులో షూటింగ్ కోసం భారీ సెట్స్ వేసి చిత్రీకరిస్తున్నారు.
అయితే... చెన్నకేశవాలయంలో శివలింగం ప్రతిష్టించడాన్ని వ్యతిరేకించిన స్థానికులు ఆందోళనకు దిగినట్లు సమాచారం. దీంతో షూటింగ్ మధ్యలోనే ఆపాల్సిన పరిస్థితి ఏర్పడిందట. చెన్నకేశవాలయంలో వైష్ణవ విధానం ఆచరిస్తుంటారు. అయితే శైవులు పూజించే శివుని విగ్రహం ఆలయంలో ప్రతిష్టించడంతో... ఉద్రిక్తతలకు దారితీసింది.
అయితే ఈ సినిమా షూటింగ్ కోసం టెంపుల్ అధికారులతో ఒప్పందం కుదుర్చుకున్న దువ్వాడ టీం రోజుకు లక్ష రూపాయలు కూడా చెల్లిస్తోంది. అంతే కాదు సెట్టింగ్స్ వేసేందుకు కూడా అనుమతి తీసుకుంది దువ్వాడ టీం. కానీ స్థానికుల ఆందోళనతో ప్రస్థుతం షూటింగ్ హోల్డ్ లో పడింది. మరి ఎలా డీల్ చేస్తారో ఏంటో.