
లోకనాయకుడు కమల్ హాసన్(Kamal Haasan) సంచలనాలు సృష్టిస్తున్నారు. సరైన హిట్లు లేక కెరీర్‌ని లాక్కొస్తున్న ఆయన దిమ్మతిరిగే హిట్ ఇచ్చాడు. ఇంకా చెప్పాలంటే ఆయనకే దిమ్మతిరిగిలే చేసింది `విక్రమ్`(Vikram) మూవీ. జూన్ 3న విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా సంచలన విజయం సాధించింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 350కోట్లు దిశగా పరుగులు పెడుతుంది. `బాహుబలి2`, `ఆర్‌ఆర్‌ఆర్`, `కేజీఎఫ్ 2`, `2.0`, `కబాలి`, `పుష్ప` వంటి చిత్రాల తర్వాత అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సౌత్ సినిమాగా `విక్రమ్` నిలవడం విశేషం.
ఈ సినిమా సైతం సరికొత్త రికార్డులు సృష్టిస్తుంది. తాజాగా తమిళనాట ఆల్‌టైమ్ రికార్డులు క్రియేట్ చేసింది. ఈ చిత్రం రూ.150కోట్లు (Vikram Collections)వసూలు చేసింది. ఇప్పటి వరకు తమిళనాట అత్యధిక కలెక్షన్లు సాధించిన `బాహుబలి 2` (Bahubali2) నిలిచింది. ఈ సినిమా కోలీవుడ్‌లో రూ.152కోట్లు వసూలు చేసింది. నేటితో ఆల్మోస్ట్ ఈ చిత్రం `బాహుబలి2`ని బీట్ చేయబోతుంది. ఇది కోలీవుడ్‌లోనే రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్లు కావడం విశేషం. దీంతో `విక్రమ్` ఇండస్ట్రీ హిట్‌గా నిలవబోతుందని చెప్పొచ్చు.
తెలుగులోనూ ఈ సినిమా భారీగానే వసూలు చేస్తుంది. ఈ చిత్రం సుమారు రూ.25కోట్లు వసూలు చేసిందని తెలుస్తుంది. మరోవైపు కన్నడ, మలయాళంలోనూ భారీ వసూళ్లు రాబడుతుందీ మూవీ. కమల్ హాసన్ నటించిన ఈ చిత్రానికి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు. కమల్ కి దర్శకుడు అభిమాని కావడం విశేషం. తన అభిమానిని తెరపై ఎలా చూపించాలో అలా చూపించారు. కమల్‌ని విశ్వరూపం చూపించారు. విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ నటన కూడా సినిమాకి ప్లస్ అయ్యాయి.