యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో మాస్ కా దాస్.. ఆయన కూతురితోనే విశ్వక్ రొమాన్స్.. విశ్వక్ న్యూ ఫిల్మ్..

Published : Jun 19, 2022, 02:25 PM IST
యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో మాస్ కా దాస్.. ఆయన కూతురితోనే విశ్వక్ రొమాన్స్..  విశ్వక్ న్యూ ఫిల్మ్..

సారాంశం

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen) లైనప్ చూస్తే షాక్ అవ్వాల్సిందే. తాజాగా ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’తో అలరించిన విశ్వక్..  లేటెస్ట్ గా యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో మరో చిత్రాన్ని ప్రకటించారు.   

‘ఏమైందీ నగరానికీ’, ‘ఫలక్‌నూమాదాస్‌’ చిత్రాలతో టాలీవుడ్‌లోకి దూసుకొచ్చిన యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్‌. అన్ని తానై రూపొందించిన ‘ఫలక్ నూమాదాస్’ సినిమా సక్సెస్‌ సాధించడంతో క్రేజీ హీరోగా మారాడు. ఆ తర్వాత `హిట్‌` చిత్రంతో మరో సక్సెస్‌ని అందుకున్నారు. గతేడాది `పాగల్‌`తో  ప్రేక్షకులకు తనలోని రొమాంటిక్ టచ్ ను పరిచయం చేశాడు. హీరోయిన్ నివేతా పేతురాజ్, విశ్వక్ సేన్ జంటగా నటించిన ఈ చిత్రం యూత్ కు బాగా కనెక్ట్ అయ్యింది. తాజాగా ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’తో  ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.  గతనెలలో రిలీజ్ అయిన ఈ చిత్రం ఆడియెన్స్ కు బాగా కనెక్ట్ అయ్యింది. మరోవైపు విశ్వక్ సేన్ కూడా పాత్రలో లీనమైనట్టు ఆడియెన్స్ తెలుపుతున్నారు. మొత్తంగా ఈ చిత్రం కూడా విశ్వక్ సేన్ కు మంచి విజయాన్నే సాధించిందని చెప్పాలి.

ఇదిలా ఉంటే.. నాలుగైదు చిత్రాల్లో నటిస్తున్న విశ్వక్ సేన్ తాజాగా తన 11వ చిత్రాన్ని కూడా ప్రకటించారు. అయితే ఈ చిత్రాన్ని మాత్రం కన్నడ స్టార్, యాక్షన్ కింగ్ అర్జున్ (Action King Arjun) డైరెక్ట్ చేయడంతో పాటు తన బ్యానర్ లోనే నిర్మిస్తున్నారు. అలాగే కథ  కూడా స్వయంగా అర్జునే అందించడంతో సినిమాపై ఆసక్తి నెలకొంది. శ్రీ రామ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెం.15గా ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. కన్నడ, తమిళం, తెలుగు, మలయాళం  చిత్రాల్లో నటించిన అర్జున్ ఆడియెన్స్ గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.

ఆయన తన  సొంత బ్యానర్ లో ఇప్పటికే చాలా చిత్రాలకు ప్రొడ్యూస్ చేశారు. అలాటే డిస్ట్రిబ్యూటర్ గాను పనిచేశారు.  నటనకే పరిమితం కాకుండా అటు దర్శకత్వంలోనూ తన ప్రతిభ చూపారు. అయితే తాజాగా తెలుగు ప్రేక్షకులకు తన డైరెక్షన్ సిల్స్ ను కూడా చూపించేందుకు సిద్ధమయ్యాడు. ఈ మేరకు యంగ్ స్టార్ విశ్వక్ సేన్  11వ చిత్రాన్ని డైరెక్ట్ చేయడంతో పాటు నిర్మిస్తున్నారు. మరో క్రేజీ న్యూస్ కూడా ఏంటంటే.. అర్జున్ కూతురు (Aishwarya Arjun)ను కూడా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు.  ఆయన డైరెక్షన్ లోనే అటు తన కూతురు వర్క్ చేయడం, ప్రధాన పాత్రలో విశ్వక్ సేన్ నటిస్తుండటం పట్ల ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. 

ఇక `అశోకవనంలో అర్జున కళ్యాణం` మూవీ విజయవంతం తర్వాత విశ్వక్  తన నెక్ట్స్ ప్రాజెక్ట్ లపై ఫోకస్ పెట్టాడు. ‘గామి, అక్టోబర్  31 లేడీస్ నైట్, ఓరి దేవుడా, దాస్ కా దమ్కీ, ముఖ చిత్రాల్లో  నటిస్తున్నారు. ఈ చిత్రాల్లో కొన్నింటి చిత్రీకరణను పూర్తి చేసిన  విశ్వక్, మిగతా వాటిని శరవేగంగా కంప్లీట్ చేస్తున్నారు. తాజాగా ‘విశ్వక్ సేన్ 11’వ చిత్రంపై అనౌన్స్ మెంట్ ఇచ్చి అభిమానులు, ఆడియెన్స్ ను సర్ ప్రైజ్ చేశారు. 

 

PREV
click me!

Recommended Stories

ఆ డైరెక్టర్ ఫోన్ చేసి ఐదుగురితో కమిట్‌మెంట్ అడిగాడు.. టాలీవుడ్ నటి ఓపెన్ స్టేట్‌మెంట్
నాగార్జున ఫ్లాప్ మూవీ గురించి చెప్పిన డైరెక్టర్, నయనతారకి సర్ప్రైజ్.. అందుకే చిరంజీవి సినిమాకి ఒప్పుకుందా