
సరదాలు, సంతోషాలు, చిన్న చిన్న రిస్క్ లు, డైలాగ్స్ బట్టీ పట్టుడు. ఆటపట్టించడాలు.. యాక్షన్ సీక్వెన్స్ లు.. ఇలా సరదాగా సాయిపోయింది విరాటపర్వం షూటింగ్ దానికి సంబంధించిన మేకింగ్ వీడియోను రిలీజ్ చేవారు మూవీ టీమ్.
టాలీవుడ్ హ్యండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో, లేడీ సూపర్ స్టార్ సాయి పల్లవి హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ చిత్రం విరాటపర్వం. వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ జూన్ 17న విడుదలై పాజీటీవ్ రివ్యూలను తెచ్చుకుంది. సక్సెస్ ఫుల్ గా రన్నింగ్ లో ఉంది విరాటపర్వం మూవీ. ఈ సినిమాలో నక్సల్స్ గా నటించిన రానా, సాయి పల్లవిల నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు, వేణు ఊడుగుల మేకింగ్‌కు మంచి ప్రశంసలు దక్కాయి.
బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ ఓపెనింగ్స్ వచ్చినా, టాక్ అద్భుతంగా రావడంతో శనివారం మంచి కలెక్షన్లు సాధించాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు మూవీ టీమ్. సందడి సందడిగా షూటింగ్ హడావిడితో పాటు.. ఒక్కొక్క మూమెంట్ ను అద్భుతంగా చూపించారు టీమ్.
ప్రేమ, విప్లవం అంశాలతో తెరకెక్కిన ఈ చిత్ర మేకింగ్ వీడియో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. వీడియోలో ప్రతి ఒక్కరి కష్టం, సినిమాపై పెట్టిన శ్రద్ద, నటీనటులు సందడీ అలరిస్తున్నాయి. 1990లో ఉత్తర తెలంగాణలో జరిగిన యధార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. రానా నక్సలైట్ రవన్న పాత్రలో నటించగా సాయి పాల్లవి వెన్నెల పాత్రలో నటించింది. నవీన్ చంద్ర, ప్రియమణి, నివేథా పేతురాజ్, ఈశ్వరీరావు కీలకపాత్రల్లో నటించారు. . శ్రీలక్ష్మీ వెంకటేశ్వరా సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై సుధాకర్ చెరుకూరితో కలిసి సురేష్‌బాబు సంయుక్తంగా ఈ విరాటపర్వాన్ని నిర్మించాడు.