నిజమేనా..మారుతి, రవితేజ కాంబోలో ట్విస్ట్?

By Surya Prakash  |  First Published Nov 30, 2020, 9:17 PM IST

రవితేజ కొన్ని మాడిఫికేషన్స్ చెప్పారని, దానిపై మారుతి వర్క్ చేసి ఈ మధ్యనే చెప్పారని, అయితే ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని వినికిడి. లైటర్ వీన్ లో సాగే  ట్రీట్మెంట్ తో రవితేజ ఇంప్రెస్ కాలేదని అంటున్నారు. అయితే మారుతి మాత్రం తన ప్రయత్నం మానలేదట. ఒప్పించేందుకు పట్టుదలగా తన టీమ్ తో కూర్చుని స్క్రిప్టు పై వర్క్ చేస్తున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు.  


ఈ ఏడాది ప్రారంభంలో ‘ప్రతిరోజు పండగే’ చిత్రం ద్వారా మంచి సక్సెస్  సొంతం  చేసుకున్నారు దర్శకుడు మారుతి. ప్రస్తుతం ఆయన రవితేజ  హీరోగా ఓ సినిమాను తెరకెక్కించే సన్నాహాల్లో ఉన్నారనే సంగతి తెలిసిందే. మారుతి చేసే ఫన్ ఎంటర్టైనర్స్ కు ఫెరఫెక్ట్ గా రవితేజ బాడీ లాంగ్వేజ్ సెట్ అవుతుందని అందరూ భావించారు.  ఈ ప్రాజెక్టు కు మీడియాలో కూడా మంచి బజ్ క్రియేట్ అయ్యింది. అదే విధంగా మారుతి చెప్పిన స్టోరీ లైన్ సైతం రవితేజకు బాగా నచ్చిందిట. అయితే కంప్లీట్ స్క్రిప్టు తో మాత్రం మారుతి ఇంప్రెస్ చేయలేకపోయారనే వార్త మొదలైంది.

 రవితేజ కొన్ని మాడిఫికేషన్స్ చెప్పారని, దానిపై మారుతి వర్క్ చేసి ఈ మధ్యనే చెప్పారని, అయితే ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని వినికిడి. లైటర్ వీన్ లో సాగే  ట్రీట్మెంట్ తో రవితేజ ఇంప్రెస్ కాలేదని అంటున్నారు. అయితే మారుతి మాత్రం తన ప్రయత్నం మానలేదట. ఒప్పించేందుకు పట్టుదలగా తన టీమ్ తో కూర్చుని స్క్రిప్టు పై వర్క్ చేస్తున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు.  అదే సయమంలో ప్రాజెక్టు సెట్ అయ్యే సమయంలో ఇలాంటివన్నీ సహజమే. స్క్రిప్టులో మార్పులు, చేర్పులు లేకుండా ఏ దర్శకుడు తన సినిమాని పట్టాలు ఎక్కించడు అని సీనియర్స్ అంటున్నారు. ఫైనల్ గా ఇది ఏ టర్న్ తీసుకుంటుందో అనేది వేచి చూడాల్సిందే.

Latest Videos

 ఇక దర్శకుడు మారుతి తన సినిమాల్లో ఎంటర్టైన్మెంట్,  ఫ్యామిలీ ఎమోషన్స్ కు పెద్దపీట వేస్తుంటారు. అయితే రవితేజతో రూపొందించనున్న  చిత్రంలో తన పంథాకు భిన్నంగా  సోషల్ మెసేజ్  ఉన్న కోర్ట్‌రూమ్‌ డ్రామా కథాంశాన్ని ఎంచుకున్నారని సమాచారం. ఈ సినిమాలో రవితేజ లాయర్‌ పాత్రలో కనిపిస్తారని చెబుతున్నారు. 
   
  సోషల్‌మెసేజ్‌ ఉన్న  కథ అయ్యినప్పటికీ మారుతి తన సినిమాల్లో చూపించే ఫన్ ని ఏ మాత్రం మిస్ కారట.  ఎంటర్టైన్మెంట్  పుష్కలంగా ఉండబోతోందని తెలిసింది.   అన్ని సరిగ్గా జరిగితే..జీఏ2 పిక్చర్స్‌, యూవీ క్రియేషన్స్‌ సంస్థలు ఈ చిత్రాన్ని  తెరకెక్కించబోతున్నాయి. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్‌మీదకు వెళ్లనున్నట్లు సమాచారం. 

click me!