ఎన్టీఆర్ సినిమా టీవీలో చూసి ఇంప్రెస్ అయ్యిన అక్షయ్ కుమార్

By Surya Prakash  |  First Published Nov 30, 2020, 9:20 PM IST

బాలీవుడ్ నిర్మాత ఎస్ తరుణి ఈ సినిమా హిందీ వెర్షన్ నిర్మించనున్నారు. భారీ ప్రాజెక్టుగా ఈ సినిమాని రూపొందించనున్నారు. కొంతమంది బాలీవుడ్ రైటర్స్ ఇప్పటికే ఈ స్క్రిప్టు పై వర్క్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. హిందీ సెన్సిబులిటీలకు అణుగుణంగా ఆ మార్పులు చేస్తున్నారు. 
 



గత కొంతకాలంగా బాలీవుడ్ మొత్తం సౌత్ వైపు చూస్తోంది. ఇక్కడ హిట్ సినిమాలు, యావరేజ్ సినిమాలను కూడా కొద్దిపాటి మార్పులతో హిందీలో చేసి హిట్ కొట్టాలనుకుంటోంది. హిందీ హీరోలు సైతం సౌత్ సినిమా రీమేక్ అనగానే డేట్స్ ఇస్తున్నారు. ముఖ్యంగా అక్షయ్ కుమార్ ...సౌత్ రీమేక్ లపై ఆసక్తి చూపిస్తున్నారు. రీసెంట్ గా ఆయన కాంచన రీమేక్ లక్ష్మీ బాంబ్ లో చేసారు. ఇప్పుడు మరో రీమేక్ పై ఆయన దృష్టి పడిందని సమాచారం. ఆ సినిమా మరేదో కాదు ఊసరవెల్లి. 2011 లో తెలుగులో వచ్చిన ఆ సినిమా ఇక్కడ యావరేజ్ అయ్యింది. ఆ సినిమాని హిందీకు మార్పులు చేసి అక్షయ్ చేయటానికి ఓ బాలీవుడ్ నిర్మాత నడుం బిగించారు.

అందుతున్న సమాచారం మేరకు బాలీవుడ్ నిర్మాత ఎస్ తరుణి ఈ సినిమా హిందీ వెర్షన్ నిర్మించనున్నారు. భారీ ప్రాజెక్టుగా ఈ సినిమాని రూపొందించనున్నారు. కొంతమంది బాలీవుడ్ రైటర్స్ ఇప్పటికే ఈ స్క్రిప్టు పై వర్క్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. హిందీ సెన్సిబులిటీలకు అణుగుణంగా ఆ మార్పులు చేస్తున్నారు. 

Latest Videos

ఎన్టీఆర్, తమన్నా జంటగా సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఊసరవెల్లి’. ఈ చిత్రం హిందీలోకు డబ్ అయ్యి అక్కడ టీవిల్లో వచ్చింది. ఈ సినిమా హిందీ డబ్బింగ్‌ వెర్షన్‌ చూసిన అక్షయ్‌ కుమార్‌ ఫిదా అయ్యి ఆయనే ఈ ప్రపోజల్ పెట్టారట.  ‘టిప్స్‌’ అనే సంస్థ ఈ సినిమా హిందీ రీమేక్‌ హక్కులు కొనుగోలు చేసింది. అయితే ఈ సంస్థ నిర్మించే చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారు? అనే విషయంపై క్లారిటీ లేదు. సురేంద్రరెడ్డి దర్శకత్వం చేస్తాడా లేక హిందీ డైరక్టర్ తో చేయిస్తారో చూడాలి.  మరో ప్రక్క ఇప్పటికే తెలుగులో హిట్‌ అయిన ‘అల వైకుంఠపురములో, ఇస్మార్ట్‌ శంకర్, ఛత్రపతి’ సినిమాలు తాజాగా బాలీవుడ్‌లో రీమేక్‌ కు రెడీ అవుతున్నాయి.
 

click me!