విలన్ రూమర్స్.. కోపంతో రగిలిపోతున్న శంకర్?

Published : Dec 04, 2018, 05:05 PM IST
విలన్ రూమర్స్.. కోపంతో రగిలిపోతున్న శంకర్?

సారాంశం

ఇండియన్ బాక్స్ ఆఫీస్ దర్శకుడు శంకర్ నెక్స్ట్ భారతీయుడు సీక్వెల్ తో సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 14న కమల్ హాసన్ తో రెగ్యులర్ షూటింగ్ ను శంకర్ స్టార్ట్ చేయనున్నాడు. 

ఇండియన్ బాక్స్ ఆఫీస్ దర్శకుడు శంకర్ నెక్స్ట్ భారతీయుడు సీక్వెల్ తో సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 14న కమల్ హాసన్ తో రెగ్యులర్ షూటింగ్ ను శంకర్ స్టార్ట్ చేయనున్నాడు. ఇక హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ ని కూడా సరికొత్తగా చూపించడానికి ఈ సంచలన దర్శకుడు ప్రయోగాలు చేస్తున్నాడు. 

అసలు విషయంలోకి వస్తే.. సినిమాకు సంబందించిన ఒక రూమర్ గత కొన్ని రోజులుగా అందరిని కన్ఫ్యూజన్ కి గురి చేస్తోంది. అదేమిటంటే సినిమాలో విలన్ గా  మరో బాలీవుడ్ హీరోని శంకర్ తన సినిమాకు సెట్ చేసుకున్నట్లు కథనాలు వెలువడ్డాయి. సీనియర్ హీరో అజయ్ దేవగన్ అందుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు బాలీవుడ్ మీడియాలో సైతం వార్తలు వచ్చాయి. 

అయితే ఈ విషయంపై దర్శకుడు శంకర్ వీలైనంత త్వరగా క్లారిటీ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాడు. సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం భారతీయుడు 2లో అజయ్ దేవగన్ విలన్ పాత్ర చేయడం లేదని తెలుస్తోంది. అయితే సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే ముందు రూమర్స్ మరింత వైరల్ అవ్వకముందే ఈ విషయంలో శంకర్ వివరణ ఇవ్వనున్నట్లు సమాచారం.  

PREV
click me!

Recommended Stories

Bharani: తన ఒరిజినాలిటీ బయటపెట్టిన భరణి.. మెగా బ్రదర్‌ నాగబాబు స్ట్రాటజీ పనిచేస్తుందా?
Akira Nandan నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా? రేణు దేశాయ్‌ ఫోన్‌ చేస్తే పవన్‌ క్రేజీ రియాక్షన్‌