మారి 2: ధనుష్ ఊర మాస్ 2 రెడీ!

Published : Dec 04, 2018, 04:41 PM IST
మారి 2: ధనుష్ ఊర మాస్ 2 రెడీ!

సారాంశం

రజినీకాంత్ అల్లుడిగా తమిళ ఇండస్ట్రీకి పరిచయం అయినప్పటికీ అతి తక్కువ కాలంలోనే తనకంటూ ఒక స్పెషల్ గుర్తింపు తెచ్చుకున్నాడు ధనుష్. చేసిన ప్రతి సినిమాలో ఎదో ఒక కొత్తదనం ఉండేలా చూసుకోవడం అలాగే నటనకు ప్రాధాన్యత ఇవ్వడం ఈ హీరో సక్సెస్ కు ప్రధాన కారణాలు. 

ఇక గతంలో చేసిన యాక్షన్ కామెడీ ఫిల్మ్ మారి సీక్వెల్ రిలీజ్ కు సిద్ధమైంది. డిఫరెంట్ యాంగిల్ లో ఊర మాస్ పాత్రలో ధనుష్ చేసిన మారి 1 సినిమా ఓ వర్గం వారిని బాగా ఆకట్టుకుంది. తెలుగులో మాస్ గా రిలీజైన సంగతి తెలిసిందే. మారి 2 ను డిసెంబర్ 21న రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ సిద్ధమైంది. ట్రైలర్ ను బుధవారం రిలీజ్ చేయనున్నారు.

బాలాజీ మోహన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. ఆమె పాత్ర కూడా సినిమాలో హైలెట్ అని పోస్టర్స్ ద్వారా చిత్ర యూనిట్ హైప్ బాగానే క్రియేట్ చేయడంతో మళ్ళీ ధనుష్ సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఇక ధనుష్ సొంతంగా నిర్మించిన ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించారు.

PREV
click me!

Recommended Stories

సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే
ఆ డైరెక్టర్ ఫోన్ చేసి ఐదుగురితో కమిట్‌మెంట్ అడిగాడు.. టాలీవుడ్ నటి ఓపెన్ స్టేట్‌మెంట్