రిలీజ్ కు సిద్దమైన అఖిల్ ప్లాప్ సినిమా!

Published : Dec 04, 2018, 04:06 PM ISTUpdated : Dec 04, 2018, 04:08 PM IST
రిలీజ్ కు సిద్దమైన అఖిల్ ప్లాప్ సినిమా!

సారాంశం

అక్కినేని వారసుడు అఖిల్ విజయం కోసం ఎంతగా కష్టపడుతున్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మొదటి సినిమా ఫస్ట్ షోకే బెడిసికొట్టగా సెకండ్ మూవీ హలో మొదట కొంత హడావుడి చేసినప్పటికీ ఆ తరువాత కమర్షియల్ గా ప్లాప్ అని తేలిపోయింది.

అక్కినేని వారసుడు అఖిల్ విజయం కోసం ఎంతగా కష్టపడుతున్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మొదటి సినిమా ఫస్ట్ షోకే బెడిసికొట్టగా సెకండ్ మూవీ హలో మొదట కొంత హడావుడి చేసినప్పటికీ ఆ తరువాత కమర్షియల్ గా ప్లాప్ అని తేలిపోయింది. ఇక ప్రస్తుతం మిస్టర్ మజ్నుతో బిజీగా ఉన్న ఈ హీరో మరికొన్ని రోజుల్లో ఆ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. 

అసలు విషయంలోకి వస్తే అఖిల్ సెకండ్ మూవీ హలోని ఇప్పుడు కోలీవుడ్ లో రిలీజ్ చేయడానికి సన్నాహకాలు చేస్తున్నారు. తమిళ్ లో రీమేక్ చేసి ఈ నెలలోనే భారీ స్థాయిలో రిలీజ్ చెయ్యాలని అక్కడి పంపిణీదారులు ప్లాన్ చేస్తున్నారు. హలో దర్శకుడు విక్రమ్ కె కుమార్ కి కోలీవుడ్ లో మంచి గుర్తింపు ఉండడంతో అక్కడ సినిమా వర్కౌట్ అవుతుందని అనుకుంటున్నారట. 

తెలుగులో అంచనాలు అమితంగా పెరగడం వల్ల కలెక్షన్స్ అందుకోలేకపోయినా  స్టోరీ పరంగా సినిమా బావుందని అప్పట్లో కొంత పాజిటివ్ టాక్ అయితే వచ్చింది. ఇక కోలీవుడ్ ఆడియెన్స్ కు సినిమా ఎంతవరకు నచ్చుతుందో చూడాలి. అలాగే తెలుగులో హిట్టలేని అఖిల్ కు తమిళ్ ప్రేక్షకుల నుంచి అయినా మొదటి విజయం దక్కుతుందో లేదో చూడాలి.   

PREV
click me!

Recommended Stories

అడివి శేష్ గూఢచారి 2 తో పాటు బోల్డ్ హీరోయిన్ నుంచి రాబోతున్న 5 సినిమాలు ఇవే
అఖండ 2 లో బాలయ్య కంటే 48 ఏళ్లు చిన్న నటి ఎవరో తెలుసా? ఐదుగురు హీరోయిన్ల ఏజ్ గ్యాప్ ఎంత?