'ఎవెంజర్స్: ది ఎండ్ గేమ్'.. తొలిరోజు వసూళ్లు!

Published : Apr 27, 2019, 04:59 PM IST
'ఎవెంజర్స్: ది ఎండ్ గేమ్'.. తొలిరోజు వసూళ్లు!

సారాంశం

ప్రపంచవ్యాప్తంగా మార్వేల్ అభిమానులు ఎదురుచూసిన 'ఎవెంజర్స్ ది ఎండ్ గేమ్' సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ దక్కించుకుంది. 

ప్రపంచవ్యాప్తంగా మార్వేల్ అభిమానులు ఎదురుచూసిన 'ఎవెంజర్స్ ది ఎండ్ గేమ్' సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ దక్కించుకుంది. ఇప్పటివరకు ఇండియన్ సినిమా చరిత్రలో ఏ ఇంగ్లీష్ సినిమాకు దక్కని ఓపెనింగ్స్ ని ఈ సినిమా సాధించి రికార్డ్స్ సృష్టించింది. 

ఈ సినిమా హాలీవుడ్ మేకర్స్ కూడా ఇండియా నుండి ఈ రేంజ్ లో రెస్పాన్స్ ఉంటుందని ఊహించి ఉండరు. గతేడాది వచ్చిన 'ఎవెంజర్స్ ఇన్ఫినిటీ వార్' మొదటి రోజు రూ.31 కోట్ల 30 లక్షల షేర్ రాబడితే 'ఎవెంజర్స్ ఎండ్ గేమ్' తొలిరోజు రూ. 63 కోట్ల 21 లక్షల గ్రాస్ సాధించి రికార్డ్స్ క్రియేట్ చేసింది.

ఇందులో షేర్ రూ.53 కోట్ల వరకు ఉంటుంది. ఈ రేంజ్ లో వసూళ్లు చూసి ట్రేడ్ పండితులు సైతం ఆశ్చర్యపోతున్నారు. శని, ఆదివారాలు బుకింగ్స్ చూస్తుంటే మరిన్ని వసూళ్లు ఖాయమనిపిస్తోంది. 

ఇంత హడావిడి చూస్తుంటే ఈ సినిమా బాహుబలి2కి క్రాస్ చేస్తుందా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆ విషయాన్ని పక్కన పెడితే ఓ ఇంగ్లీష్ సినిమాకు ఈ రేంజ్ లో వసూళ్లు రావడం చూస్తుంటే జనాల్లో సూపర్ హీరోస్ కి ఎంత క్రేజ్ ఉందో అర్ధమవుతోంది!

PREV
click me!

Recommended Stories

నాగార్జున ను 15 ఏళ్లుగా వెంటాడుతున్న అనారోగ్య సమస్య ఏంటో తెలుసా? ఎందుకు తగ్గడంలేదు?
Sivaji: కులం అనేది ఒక ముసుగు మాత్రమే, డబ్బున్నోళ్ల లెక్కలు వేరు.. శివాజీ బోల్డ్ స్టేట్‌మెంట్‌