102 కేజీలు పెరిగిపోయా.. హీరోయిన్ కామెంట్స్!

By AN TeluguFirst Published Apr 27, 2019, 4:08 PM IST
Highlights

టాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించిన సమీరా రెడ్డి తమిళ, హిందీ చిత్రాల్లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. 

టాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించిన సమీరా రెడ్డి తమిళ, హిందీ చిత్రాల్లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గడంతో పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయింది. ఓ బిడ్డకు జన్మనిచ్చిన తరువాత తిరిగి మళ్లీ సినిమాల్లో బిజీ అవ్వాలనుకుంది.

కానీ అధిక బరువు కారణంగా తన ఆశలన్నీ తలకిందులు అయ్యాయని చెప్పుకొచ్చింది. బాబుకి జన్మనిచ్చిన తరువాత ఓ వ్యాధి కారణంగా ఐదు నెలల పాటు బెడ్ కే పరిమితం కావాల్సి వచ్చిందని.. ఇంట్లోనే ఉండడం వలన బరువు పెరిగిపోయాయని చెప్పుకొచ్చింది.

వర్కవుట్స్ చేయడానికి వీలు లేకపోవడంతో ఏకంగా 102 కేజీల బరువు పెరిగినట్లు చెప్పుకొచ్చింది. ఆ సమయంలో ఎప్పుడైనా బయటకి వెళితే తనపై కామెంట్స్ చేసుకొని నవ్వేవారని.. అవి తనను బాధకు గురి చేసినట్లు చెప్పింది.

ఆ కారణంగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయినట్లు, వైద్యుల సహాయంతో బయటపడినట్లు చెప్పుకొచ్చింది. ప్రస్తుతం గర్భవతి అయిన తను బిడ్డకు జన్మనిచ్చిన తరువాత మునుపటి  రూపంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తానని వెల్లడించింది. 

click me!