స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో కీర్తి సురేష్ సినిమా!

Published : Apr 27, 2019, 04:24 PM IST
స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో కీర్తి సురేష్ సినిమా!

సారాంశం

'మహానటి' సినిమా తరువాత కీర్తి సురేష్ తన సినిమాల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది.

'మహానటి' సినిమా తరువాత కీర్తి సురేష్ తన సినిమాల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. ఆచితూచి ముందడుగు వేస్తోంది. తాజాగా ఆమె ఓ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో సాగే సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఈ సినిమాలో కీర్తి సురేష్ తో పాటు ఆది పినిశెట్టి, జగపతిబాబు, రాహుల్ రామకృష్ణలు ప్రధాన పాత్రలు పోషించబోతున్నారు. వర్త్ ఏ షాట్ సంస్థ ఈ సినిమాను నిర్మించాబోతుంది. స్పోర్ట్స్, రొమాన్స్, కామెడీ అంశాలతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు నగేష్ కుకునూర్. 

బాలీవుడ్ లో 'హైద‌రాబాద్ బ్లూస్‌', 'ఇక్బాల్' వంటి సినిమాలను డైరెక్ట్ చేసిన నగేష్ ఇప్పుడు కీర్తి సురేష్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కానున్నారు. ప్రస్తుతం కీర్తి సురేష్ మలయాళంలో ఓ సినిమాలో  నటిస్తున్నారు. అలానే అజయ్ దేవగన్ నటిస్తోన్న ఓ చిత్రంతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతుంది. 

PREV
click me!

Recommended Stories

సుస్మిత కొణిదెల భర్త బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా? చిరంజీవి పెద్దల్లుడు రేంజ్ తెలిస్తే షాక్ అవుతారు..
తరుణ్ బిజీగా ఉండటంతో.. ఉదయ్ కిరణ్ కు దక్కిన బ్లాక్ బస్టర్ సినిమా ఏదో తెలుసా?