#Avatar:‘అవతార్’4K వెర్షన్ లో రీ రిలీజ్, డేట్ ఎప్పుడంటే...

Published : Aug 24, 2022, 11:58 AM IST
#Avatar:‘అవతార్’4K వెర్షన్ లో రీ రిలీజ్, డేట్ ఎప్పుడంటే...

సారాంశం

రతీయ ఇతిహాస గ్రంధమైన రామాయణంలోని పాత్రల ఆధారంగా ఫాంటసీ చిత్రంగా మలిచాడు దర్శకుడు. ఈ సినిమా విడుదలైన చాలా ఏళ్ళ తర్వాత దర్శకుడు కేమరూన్ దీనికి సీక్వెల్స్ ను అనౌన్స్ చేసి విడుదల సంవత్సరాల్ని కూడా ముందుగానే తెలిపాడు. 


ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద చెరగని రీతిలో వసూళ్ళను రాబట్టిన ఏకైక హాలీవుడ్ మూవీ ‘అవతార్’. దిగ్దర్శకుడు జేమ్స్ కేమరూన్ తెరకెక్కించిన ఈ సినిమా 2009 లో విడుదలైంది. అప్పటి టికెట్ ధరలతో ఇప్పటికీ క్రాస్ చేయలేని వసూళ్ళను నమోదు చేసింది ఈ సినిమా. భారతీయ ఇతిహాస గ్రంధమైన రామాయణంలోని పాత్రల ఆధారంగా ఫాంటసీ చిత్రంగా మలిచాడు దర్శకుడు. ఈ సినిమా విడుదలైన చాలా ఏళ్ళ తర్వాత దర్శకుడు కేమరూన్ దీనికి సీక్వెల్స్ ను అనౌన్స్ చేసి విడుదల సంవత్సరాల్ని కూడా ముందుగానే తెలిపాడు. అందులో భాగంగా ఇప్పుడు ‘అవతార్ 2’ సినిమా రెడీ అవుతోంది.  

ఈ నేపధ్యంలో అప్పటి అవతార్ ని మరోసారి గుర్తు చేయాలనుకుంటున్నారు. అప్పుడు ఈజీగా ఇప్పటి అవతార్ కు కనెక్ట్ అవుతారని భావిస్తున్నారు. అందుకే 4K వెర్షన్ లో ఈ సినిమాని రిలీజ్ చేయటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ మేరకు అఫీషియల్ గా డైరక్టర్  జేమ్స్ కేమరూన్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి తెలియచేసారు. సెప్టెంబర్ 23 న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ మేరకు ట్రైలర్ ని సైతం రిలీజ్ చేసారు.

ఇదిలా ఉంటే... ‘అవతార్‌’ కొనసాగింపుగా రానున్న చిత్రం రిలీజ్ కు రెడీ అవుతోంది. నీటి అడుగు భాగాన ఈ కథ జరుగుతుందన్న అంచనాలకు అనుగుణంగా ‘అవతార్‌.. ది వే ఆఫ్‌ వాటర్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. లాస్‌ వేగస్‌లో జరిగిన సినిమాకాన్‌ కార్యక్రమంలో ప్రదర్శించిన ఫస్ట్‌ గ్లింప్స్‌ ప్రేక్షకులను మరో లోకానికి తీసుకెళ్లిపోయిందని తెలుస్తోంది. 

పండోరా ప్రపంచంలోని ఎగిరే జీవి టోరుక్‌తో పాటు వేల్స్‌ తరహా కొత్త జీవులు ఈ సినిమాలో కనిపించనున్నాయని సమాచారం. డిసెంబర్‌ 16న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు డిస్నీ సంస్థ తాజాగా ప్రకటించింది. ఈ సినిమాకు రెండు నెలలు ముందుగా సెప్టెంబరు 23న ‘అవతార్‌ 1’ను మరో సారి విడుదల చేయనున్నారు.

PREV
click me!

Recommended Stories

Sobhan Babu రిజెక్ట్ చేసిన సినిమాతో.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన హీరో ఎవరు? ఏంటా సినిమా?
Pawan Kalyan కు అభినవ కృష్ణదేవరాయ బిరుదు, ధర్మం, రాజ్యాంగం వేరు కాదన్న పవర్ స్టార్