
సమస్యలు వచ్చినప్పుడు భయపడం, లేదంటే ఆ సమస్య నుంచి దూరంగా పారిపోవడం కాదు.. ఆసమస్యతో పోరాట చేయాలి. ఆ సమస్యపై విజయం సాధించాలి... ఈ సూత్రన్ని చాలా చిన్న వయస్సులో గ్రహించాడు ఓ చిన్నారు. తన సమస్యను నలుగురికి తెలిసేలా చేయాలి అనుకున్నాడు. అనకున్నదే దడువుగా... రిపో్ర్టర్ అవతారం ఎత్తాడు.. తన స్కూల్లో పేరుకుపోయిన సమస్యలన్నింటి గురించి రిపోర్ట్ చేశాడు. అది కాస్త రీల్ స్టార్.. రియల్ హీరో సోనూ సూద్ కంట పడింది. వెంటనే ఆయన స్పందించాడు.
జార్ఖండ్ రాష్ట్రంలో..గొడ్డ జిల్లా లోని ఓ ప్రభుత్వ పాఠశాల దుస్థితిపై అందులో చదువుతున్న ఓ విద్యార్థి రిపోర్టర్‌లామారిపోయి..స్కూల్ అంతా తిరుగుతూ సమస్యలను వీడియో తీసి రిపోర్టింగ్ చేశాడు. ఈ వీడియోపై బాలీవుడ్ నటుడు.. సోనూసూద్ స్పందిస్తూ..సర్పరాజ్ ఇక తన కొత్త స్కూల్ నుంచి రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. స్కూల్, హాస్టల్ అతడి కోసం ఎదురుచూస్తున్నాయి..అంటూ రీట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో, ట్వీట్ నెట్టింట్లో తెగ హల్ చల్ చేస్తున్నాయి. బాలీవుడ్ తో పాటు జార్ఖాండ్ అంతట ఇదే చర్చ నడుస్తోంది.
ఇక లాక్‌డౌన్ టైమ్ లో దేవుడు అనిపించుకున్నాడు సోనూసూద్. వేలాది మందికి నేనున్నానంటూ అండగా నిలిచి రియల్ హీరో అయ్యారు సోనూసూద్. కష్టాల్లో ఉన్నవారి కన్నీళ్ళు తుడిచాడు. ఆకలి అన్నవారి కడుపునింపాడు, విద్యార్ధుల చదువులు ఆగిపోకుండా చేయూతనిచ్చాడు. ఎవరైనా తమకు కష్టం వచ్చిందని సోనూసూద్ దృష్టికి తీసుకొస్తే చాలు..తనకు చేతనైనంత సాయం చేస్తుంటారు సోనూసూద్. ఈ స్టార్ యాక్టర్ ఎప్పుడూ ఏదో ఒక సాయం చేసి వార్తల్లో నిలుస్తూ ఎంతోమంది హృదయాలను గెలుచుకున్నిరు. తాజాగా జార్ఖండ్ లోని విద్యార్థి సమస్యకు పరిష్కారం చూపించారు రియల్ హీరో.