మ‌రోసారి క‌రోనా బారినపడ్డ బిగ్ బీ.. ఆరోగ్య పరిస్థితిపై అభిమానుల్లో ఆందోళన..

Published : Aug 24, 2022, 03:43 AM IST
మ‌రోసారి క‌రోనా బారినపడ్డ బిగ్ బీ.. ఆరోగ్య పరిస్థితిపై అభిమానుల్లో ఆందోళన..

సారాంశం

అమితాబ్ బచ్చన్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా బిగ్ బీ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేశారు. దీంతో అమితాబ్ బచ్చన్ ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అమితాబ్ బచ్చన్ ఆసుపత్రిలో చేరారా? లేదా? అనేది క్లారిటీ లేదు. అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం 'కౌన్ బనేగా కరోడ్‌పతి 14' అనే క్విజ్ షోకు హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న విష‌యం తెలిసిందే..  

దేశంలో కరోనా వైరస్ మరోసారి విధ్వంసం సృష్టిస్తుంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ మ‌రోసారి క‌రోనా బారినప‌డ్డారు. ఈ విషయాన్ని అమితాబ్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. గ‌త కొన్ని రోజులుగా తనతో పరిచయం ఉన్న వారందరూ  పరీక్ష చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

అమితాబ్ బచ్చన్‌కు కరోనా ఎలా వచ్చింది?

ప్ర‌స్తుతం  అమితాబ్ బచ్చన్ 'కౌన్ బనేగా కరోడ్‌పతి సీజ‌న్ 14' షూటింగ్‌లో బిజీబిజీగా ఉన్నారు. ఈ  షో సమయంలో అమితాబ్ బచ్చన్ చాలా మంది కంటెస్టెంట్స్ ను క‌లిశారు. అటువంటి పరిస్థితిలో..  ఆయ‌న క‌రోనా బారిన  ప‌డి ఉండ‌వ‌చ్చ‌ని భావిస్తున్నారు.  గ‌తంతో కరోనా వైరస్ బారిన ప‌డిన నుంచి   అమితాబ్ త‌న ఆరోగ్యం గురించి చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. అమితాబ్ బచ్చన్  'కెబిసి 14' సెట్‌లో చాలా జాగ్రత్తగా ఉండేవాడనీ, ఇప్ప‌టికి క‌రోనా ప్రోటోకాల్ పాటిస్తాడ‌నీ,  అతనికి  కరోనా ఎలా సోకిందో చెప్ప‌డం క‌ష్ట‌మంటున్నారు షో నిర్వ‌హ‌కులు.ఇదిలా ఉంటే.. అమితాబ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారా?  లేదా ఇంట్లో ఉన్నాడా? అనే విష‌యంలో క్లారిటీ లేక‌పోవ‌డంతో అభిమానులు ఆందోళ‌న చెందుతున్నారు.
 
ఇదిలాఉంటే.. అమితాబ్   'KBC 14 షో తోపాటు...ఇతర ప్రాజెక్ట్‌లతో చాలా బిజీగా ఉన్నాడు. ఇటీవల అజయ్ దేవగన్ 'రన్‌వే 34' చిత్రంలో కనిపించాడు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. దీని తరువాత.. రణబీర్ కపూర్, అలియా భట్ల చిత్రం 'బ్రహ్మాస్త్రలో ప్ర‌త్యేక రోల్ లో  కనిపించనున్నాడు. ఈ చిత్రం సెప్టెంబర్ 9న  విడుదల కానుంది. 
  
అమితాబ్ బచ్చన్ కోసం అభిమానులు ప్రార్థనలు 

అమితాబ్ బచ్చన్ రెండేళ్ల క్రితం (2020లో) కరోనా బారిన ప‌డిన విష‌యం తెలిసిందే. ఆ సమయంలో ముంబైలోని నానావతి హాస్పిటల్‌లో చాలా రోజులు అడ్మిట్ అయ్యాడు. అమితాబ్ బచ్చన్ క్షేమం కోసం అభిమానులు పగలు రాత్రి ప్రార్థనలు చేస్తున్నారు. అమితాబ్ బచ్చన్ మళ్లీ కోవిడ్ పాజిటివ్ అని తెలియడంతో అభిమానులు ఆందోళ‌న చెందుతున్నారు.  'గెట్ వెల్ సూన్' అంటూ అభిమానులు ఆయన్ను విష్ చేస్తూ.. తన బాగోగులు చూసుకోవాలని కోరుతున్నారు. ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోవాల‌ని అత‌ని అభిమానులు ప్ర‌త్యేక పూజ‌లు చేస్తున్నారు. ఇప్పటివరకు చాలా మంది బాలీవుడ్ ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. వారిలో కరీనా కపూర్ ఖాన్, మృణాల్ ఠాకూర్, ఏక్తా కపూర్, అమృతా అరోరా, అర్జున్ కపూర్ మరియు ఇతర ప్రముఖులు ఉన్నారు.

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?