
ప్రపంచ సినీప్రేక్షకులు ఎప్పుడెపుడా అని ఎదురు చూస్తున్న అవతార్ సీక్వెల్ అవతార్2 వచ్చేస్తోంది. హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామరూన్ అద్భుత సృష్టికి సాక్ష్యంగా.. ట్రైలర్ ను రిలీజ్ చేశారు టీమ్.
వరల్డ్ సిల్వర్ స్క్రీన్ పై అద్భుతాన్ని ఆవిష్కరించి , అవతార్ సినిమా సృష్టించిన ప్రభంజనం అంతాఇంతా కాదు. అనేక భాషల్లోకి డబ్ అయిన ఈ సినిమా కోట్ల మంది మనసులను గెలుచుకుంది. ముఖ్యంగా నిర్మాతలకు డాలర్ల వర్షం కురిపించింది. 2009లో జేమ్స్ కామెరాన్ దర్శకత్వంలో వచ్చిన అవతార్ ఆస్కార్ వేదికపైనా అవార్డుల పంట పండించింది.
ఇక అవతార్ వచ్చిన చాలా కాలానికి ఈ సినిమా సీక్వెల్ ను ప్రకటించాడు దర్శకుడు అది కూడా ఒకటి కాదు నాలుగు సీక్వెల్ సినిమాలు ప్రకటించాడు. కారో కారణంగా షూటింగ్ డిలై అవుతూ వస్తున్నా.. ఎక్కడా తగ్గకుండా సినిమాలు వరుసగా ప్లాన్ చేసుకు. ఇక ఇప్పుడు అవతార్ 2 ను రిలీజ్ కు రెడీ చేశాడు కామరూన్. అంతే కాదు ఈమూవీ నుంచి అద్భుతమైన ట్రైలర్ ట్రీట్ కూడా ఇచ్చాడు.
ఈ ఏడాది డిసెంబరు 16న అవతార్ 2 ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా అవతార్-2కి చెందిన టీజర్ ట్రైలర్ ను మూవీ టీమ్ సోషల్ మీడియాలో పంచుకుంది. ఈసారి అవతార్ లో సముద్ర లోకాన్ని ఆవిష్కరించినట్టు టీజర్ ట్రైలర్ చెబుతోంది. అద్భుతమైన గ్రాఫిక్స్ మాయాజాలం అడుగడుగునా దర్శనమిస్తోంది. మొత్తమ్మీద టీజర్ ట్రైలర్ తోనే అవతార్-2పై అమితమైన ఆసక్తి రేకెత్తించారు. ట్రైలర్ ఆసక్తిగా ఉన్నా సినిమా కథేంటి అనేది సస్పెన్స్‌గానే ఉంది. కాగా ఈ మూవీ డిసెంబర్ 16న విడుదలకు సిద్ధంగా ఉండగా, 2024లో అవతార్ 3, 2026లో అవతార్ 4, 2028లో అవతార్ 5 సినిమాలు రిలీజ్ కానున్నాయి.