SVP:“డాక్టర్ స్ట్రేంజ్”ఎఫెక్ట్ ఉందా? USA ప్రీమియర్స్ కలెక్షన్స్ ప్రిడక్షన్

Surya Prakash   | Asianet News
Published : May 10, 2022, 06:30 AM IST
SVP:“డాక్టర్ స్ట్రేంజ్”ఎఫెక్ట్ ఉందా? USA ప్రీమియర్స్ కలెక్షన్స్ ప్రిడక్షన్

సారాంశం

 ఈ ప్రీమియర్  కలెక్షన్స్  $600-700K రేంజిలో ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఇది డీసెంట్ నెంబర్. అయితే అదిరిపోయే నెంబర్ కాదు. కానీ ఊహించని విధంగా ఒక్కసారిగా కలెక్షన్స్ పుంజుకోవచ్చు అంటున్నారు.   

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ పరుశురామ్ పెట్లా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సర్కారు వారి పాట’  (Sarkaru Vaari Paata). ఈ సినిమా విడుదలకు మరో  2 రోజులు మాత్రమే మిగిలి ఉంది. దాంతో ఈ సినిమాకు సంభందించిన విశేషాలు,విషయాలు,ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో కొనసాగుతున్నాయి. ఇప్పటికే భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకున్న ఈ సినిమా అడ్వాన్స్ బుక్కింగ్ లోనూ అదరకొడుతోంది. ఈ నేపధ్యంలో ఈ సినిమా యూఎస్‌ ప్రీమియర్స్  కలెక్షన్స్ ని  ట్రేడ్ లో అంచనాలు, లెక్కలు వేస్తున్నారు.

‘సర్కారు వారి పాట’ సినిమా యూఎస్‌లో ఎప్పుడూ  లేనట్టుగా రికార్డు స్థాయిలో 603 లోకేషన్స్‌లో విడుదల కాబోతోంది. ప్యాన్ ఇండియా సినిమాలు తప్పించి తెలుగులో ఓ సినిమా ఈ రేంజ్‌లో ఇన్ని లోకేషన్స్‌లో విడుదల కావడం ఇదే ఫస్ట్ టైమ్. దీంతో మహేష్ బాబు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ చిత్రం  యూఎస్‌ ప్రీ రిలీజ్ సేల్స్ ఇప్పటిదాకా $350K దాటాయి.  ఈ ప్రీమియర్  కలెక్షన్స్  $600-700K రేంజిలో ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఇది డీసెంట్ నెంబర్. అయితే అదిరిపోయే నెంబర్ కాదు. కానీ ఊహించని విధంగా ఒక్కసారిగా కలెక్షన్స్ పుంజుకోవచ్చు అంటున్నారు.  అమెరికాలో ఈ సినిమా ప్రీమియర్లు ఒకరోజు ముందుగానే అంటే.. మే 11వ తేదీన ప్రదర్శనలు ప్రారంభం కానున్నాయి.

 అయితే ఈ సినిమా విడుదలకు కొద్ది రోజుల ముందు మార్వెల్ “డాక్టర్ స్ట్రేంజ్: మ్యాడ్‌నెస్ ఆఫ్ ది మల్టీవర్స్” తెరపైకి వచ్చింది. హాలీవుడ్‌లో ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో “డాక్టర్ స్ట్రేంజ్” ఒకటి. ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద అద్బుతమైన స్పందన వచ్చింది. దాదాపు ఇండియాలో కూడా ఈ మూవీ గురించి సూపర్ హీరో మూవీని ఇష్టపడే ప్రేక్షకులు చాలా ఆతృతగా ఎదురు చూసారు. ఈ చిత్రం మే 6న దేశవ్యాప్తంగా ప్రధాన భాషల్లో విడుదల అయ్యింది. సినిమా ప్రేక్షకులను టాక్ మిక్సెడ్ గా ఉన్నా బాక్స్ ఆఫీస్ వద్ద  “డాక్టర్ స్ట్రేంజ్” సునామీని సృష్టిస్తున్నాడు. ఆ తరువాత వారం కూడా గ్యాప్ లేకుండానే మహేష్ థియేటర్లలో సందడి చేయటం కాస్త ఇబ్బందే.  దాంతో “సర్కారు వారి పాట”పై “డాక్టర్ స్ట్రేంజ్” ప్రభావం తప్పకుండా కొంతైనా పడుతుందని భావిస్తున్నారు విశ్లేషకులు.  
 
అలాగే ఈ విషయమై అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ ఓ ప్రకటన చేసారు. సర్కారు వారీ పాట సినిమాను XD, RPX, సోని డీసీ స్క్రీన్లలో ప్రదర్శించాలని రిక్వెస్ట్‌లు వచ్చాయి. అయితే వాటిలో ప్రదర్శించడానికి వీలు కావడం లేదు. ఆ థియేటర్లు అందుబాటులో లేవు. ఈ థియేటర్లు ముందుగానే హాలీవుడ్ చిత్రం డాక్టర్ స్ట్రేంజ్ కోసం బుక్ అయ్యాయి. దాంతో ప్రాంతీయ చిత్రానికి ఆ థియేటర్లు అందుబాటులో లేవు. ఈ అసౌకర్యానికి చింతిస్తున్నాం అని ఓవర్సీస్ డిస్టిబ్యూటర్లు ఫ్లైహై సినిమాస్, శ్లోకా ఎంటర్‌టైన్‌మెంట్స్, క్లాసిక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే మెంటల్ మాస్ సినిమాను చూసే అభిమానులకు కొత్త అనుభూతిని అందించే ప్రయత్నం చేస్తున్నాం. XD, RPX, సోని డీసీ స్క్రీన్లలో ప్రదర్శించే వెసలుబాటు కలిగితే వెంటనే మీకు సమాచారం అందిస్తాం. మీ చూపిస్తున్న ఆదరణ, సపోర్టుకు మరోసారి ధన్యవాదాలు అని తెలిపారు.

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?