NTR-Koratala: ఎన్టీఆర్‌, కొర‌టాల శివ‌ చిత్రం బడ్జెట్ అంతా?భారీగానే

By Surya Prakash  |  First Published May 10, 2022, 6:46 AM IST

 ఈ సినిమాకు సంబంధించిన ప్రీప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను ప్రారంభించార‌ని స‌మాచారం. ఈ నేపధ్యంలో ఈ చిత్రం బడ్జెట్ ఎంత అనేది బయిటకు వచ్చింది.  



  2018లో వ‌చ్చిన ‘అర‌వింద వీర రాఘ‌వ‌’ సినిమా త‌ర్వాత ఎన్టీఆర్ కి ఆర్.ఆర్.ఆర్ వచ్చేదాకా గ్యాప్ వచ్చింది.  ఆర్ఆర్ఆర్ విడుద‌లను ఎన్నో కార‌ణాలు అడ్డుకున్నాయి. మొద‌ట్లో క‌రోనా కార‌ణంగా షూటింగ్ వాయిదా ప‌డుతూ వ‌స్తే,  థార్డ్ వేవ్ సినిమా సైతం విడుద‌ల‌కు అడ్డుకుంది. ఎట్టకేలకు నెల క్రితం ఈ సినిమా రిలీజై ఘన విజయం సాధించింది.  కొరటాల శివ దర్శకత్వంలో చిరంజివి హీరోగా రూపొందిన ఆచార్య పరిస్దితి కూడా అదే. అదీ లేటవుతూ వచ్చి చివరకు మొన్న రిలీజైంది. దాంతో ఎప్పుడో ప్రారంభం కావాల్సిన ఎన్టీఆర్...కొర‌టాల‌  సినిమా లేటైంది.

ఇక వరసగా నాలుగు సూపర్ హిట్ సినిమాలను అందించిన కొరటాల శివ "ఆచార్య" సినిమాతో మర్చిపోలేని డిజాస్టర్ ను అందుకున్నారు. ప్రస్తుతం తన ఆశలన్నీ తన తదుపరి సినిమా #ఎన్టీఆర్30న పెట్టుకున్నారు కొరటాల. ఎలాగైనా ఈ సినిమాతో ఒక మంచి సూపర్ హిట్ ని అందుకొని మళ్ళీ తన సక్సెస్ స్ట్రీక్ ని కొనసాగించాలి కొరటాల శివ. ఈ నేపథ్యంలోనే  కొరటాల శివ పూర్తి స్దాయిలో ఎన్టీఆర్  సినిమా కథ మీద మాత్రమే ఫోకస్ చేసినట్లు సమాచారం. 

Latest Videos

అతి త్వరలో సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్‌ను ప్రారంభించాల‌నే ఆలోచ‌న‌తో ఉన్న కొర‌టాల ఆ దిశ‌గా ఇప్పిటికే అడుగులు వేశార‌ని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను ప్రారంభించార‌ని స‌మాచారం. ఈ నేపధ్యంలో ఈ చిత్రం బడ్జెట్ ఎంత అనేది బయిటకు వచ్చింది. అందుతున్న సమాచారం మేరకు ...ఈ సినిమాకి రూ.150 కోట్ల బ‌డ్జెట్ ఖాయం చేశారని వినికిడి. ఈ బడ్జెట్ ...రెమ్యునరేషన్స్ తో కలిపి అని అంటున్నారు. 

ఆర్‌.ఆర్‌.ఆర్‌తో ఎన్టీఆర్ స‌త్తా హిందీ మార్కెట్  కి కూడా తెలిసింది. కాబ‌ట్టి… రూ.150 కోట్లలో కొంత అక్కడ నుంచే వచ్చేస్తుంది. కాబట్టి అది  పెద్ద విషయం కాదు. అయితే ఈ సినిమా ప‌ట్టాలెక్క‌డానికి ఇంకొంత స‌మ‌యం ప‌ట్టేలా ఉందంటున్నారు.స్క్రిప్టు ఓకే చేసుకున్నా. మరోసారి మొత్తం సరిచూసుకోవాలని వ‌ర్క్ చేయాల‌న్న త‌ప‌న‌తో.. కొర‌టాల కొంత స‌మ‌యం తీసుకుంటున్న‌ట్టు టాక్‌.  జూన్‌లో ఈ సినిమా క్లాప్ కొట్టి, ఆగ‌స్టు నుంచి సెట్స్‌పైకి వెళ్లే అవకాసం ఉంది.
  
ఈ క్ర‌మంలోనే త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన హీరోయిన్‌, ఇత‌ర కీల‌క న‌టీన‌టుల‌ను ప్ర‌క‌టించ‌డానికి క‌స‌ర‌త్తులు మొద‌లు పెట్టారు. జ‌న‌తా గ్యారేజ్ వంటి సూపర్ హిట్ ఇచ్చిన వీరిద్ద‌రి కాంబినేష‌న‌ల్‌లో వ‌స్తోన్న ఈ సినిమాపై ఇప్ప‌టి నుంచే భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా పూర్తికాగానే ఎన్టీఆర్ కేజీఎఫ్ ఫేమ్ ప్ర‌శాంత్ నీల్ డైరెక్ష‌న్‌లో ఓ సినిమా చేయ‌నున్న‌విష‌యం తెలిసిందే. 

click me!