షాకింగ్ న్యూస్.. ఇండియాలో KGF 2 రికార్డు బ్రేక్ చేసిన అవతార్ 2

Published : Dec 15, 2022, 12:03 PM IST
షాకింగ్ న్యూస్.. ఇండియాలో KGF 2 రికార్డు  బ్రేక్ చేసిన అవతార్ 2

సారాంశం

ఒక ఫారెన్ మూవీ మన దేశంలో..మన సినిమాల రికార్డ్ లను తిరగరాస్తుంది. అది కూడా రిలీజ్ అవ్వకముందే. అవతార్ సీక్వెల్ గా అవతార్ 2 పేరుతో రిలీజ్ కాబోతున్న ఈమూవీ ఇండియాన్ సినిమాకు బిగ్ షాక్ ఇచ్చింది.    

ఒక ఫారెన్ మూవీ మన దేశంలో..మన సినిమాల రికార్డ్ లను తిరగరాస్తుంది. అది కూడా రిలీజ్ అవ్వకముందే. అవతార్ సీక్వెల్ గా అవతార్ 2 పేరుతో రిలీజ్ కాబోతున్న ఈమూవీ ఇండియాన్ సినిమాకు బిగ్ షాక్ ఇచ్చింది.  

ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న హాలీవుడ్ సినిమా అవతార్ 2. టైటానిక్, అవతార్ లాంటి వరల్డ్ క్లాసిక్ సినిమాలు తెరకెక్కించిన లెజెండరీ డైరెక్టర్ జేమ్స్ కామరూన్  డైరెక్ట్ చేస్తుండటం.  అవతార్ లాగానే ఇది కూడా మరో విజువల్ వండర్ గా తెరకెక్కుతుండటంతో..  ఈ అవతార్ 2 పై భారీగా అంచనాలు ఉన్నాయి. అవతార్ సినిమా రిలీజ్ అయిన 13 సంవత్సరాల తరువాత అవతార్2 సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయబోతోంది. 

రిలీజ్ అవ్వకముందే రికార్డ్  ల వేట మొదలెట్టింది అవతార్ సీక్వెల్ మూవీ. మన తెలుగుతో పాటుగా వరల్డ్ వైడ్ దాదాపు 160 భాషల్లో అవతార్ 2 సినిమారిలీజ్ కాబోతుంది. రేపు (డిసెంబర్ 16) రిలీజ్ కాబోతున్న ఈసినిమా ఇండియాలో సంచలనాలు సృష్టిస్తోంది. రిలీజ్ కు ముందే బాక్సాఫీస్ కు దడపుట్టిస్తోంది అవతార్2. ముఖ్యంగా  ఈ సినిమా రిలీజ్ ముందే అడ్వాన్స్ బుకింగ్స్ లోనే రికార్డులు తిరగరాస్తోంది. 

బాహుబలితరువాత మన ఇండియన్ సినిమా రేంజ్ మారిపోయింది. కలెక్షన్లు, అంతకు ముందు అడ్వాన్స్ బుక్కింగ్స్ లో మనవాళ్ళు కోట్లు దాటిపోతున్నారు. ఈక్రమంలనే ఇప్పటి వరకూ కెజియఫ్ పేరు మీద ఉనన అడ్వాన్స్ బుక్కింగ్స్ కలెక్షన్ల రికార్డ్ ను అవతార్ 2 బ్రేక్ చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు అడ్వాన్స్ బుకింగ్స్ లో టాపర్ గా నిలిచిన కేజీఎఫ్ 2 మూవీ రికార్డు కనుమరుగైపోయింది.

గతంలో ఎన్నడు లేని విధంగా ఇండియాలో అవతార్ 2 కోసం ఇప్పటికే   4,41,960 మంది అడ్వాన్స్‌ బుకింగ్స్ చేసుకున్నారట. గతంలో ఏ సినిమాకి ఈ స్థాయిలో జరగనంతగా  అడ్వాన్స్ బుకింగ్స్  అవతార్ 2 కి జరిగడం విశేషం. అయితూ  ఇండియాలో  కేజీఎఫ్ 2 సినిమాకి 4,11,000 మంది అడ్వాన్స్ బుకింగ్స్ చేసుకున్నారు. ఇది ఇప్పటివరకూ ఆల్ టైమ్ రికార్డు. దాన్ని బ్రేక్ చేసింది అవతార్.  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vijay Trisha: ఇక దాచిపెట్టేది ఏమీ లేదు.. మ్యాచింగ్ డ్రెస్ లో జంటగా పెళ్ళికి హాజరైన విజయ్, త్రిష
Preity Mukhundhan: కన్నప్ప హీరోయిన్ కి గోల్డెన్ ఛాన్స్, స్టార్ హీరోతో రొమాన్స్.. ఇక దశ తిరిగినట్లే