
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అంటే వెంటనే ప్రభాస్, విశాల్ పేర్లు గుర్తుకు వస్తాయి. నాలుగు పదుల వయస్సు దాటి పరుగులు పెడుతున్నా.. పెళ్ళివైపు గాలి వీచడంలేదు ఈ స్టార్ హీరోలకు పెళ్లెప్పుడంటూ మీడియా అడిగిన ప్రశ్నలకు.. ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటున్నారే తప్పా.. క్లారిటీ మాత్రం ఇవ్వడంలేదు స్టార్స్. ఇక తాజాగా పెళ్ళెప్పుడంటూ విశాల్ ను మీడియా అడగ్గా.. ప్రభాస్ తో లింక్ చేసి.. సమాధంనచెప్పాడు విశాల్.
ప్రస్తుతం విశాల్ పెళ్ళిపై తమిళనాట రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. గతంలో తెలుగు నటితో ఎంగేజ్మెంట్ చేసుకుని.. అది బ్రేకప్ చేసుకునన విశాల్. ఆతరువాత నడిగర్ సంఘానికి భవనం నిర్మించిన తరువాత పెళ్ళి చేసుకుంటాను అని చెప్పాడు. ఇక రీసెంట్ గా మీ పెళ్లి ఎప్పుడు అని అడగ్గా..ముందు ప్రభాస్ ను పెళ్ళి చేసుకోనివ్వండి.. ఆ వెంటనే నేను చేసుకుంటాను అంటూ ఫన్నీ ఆన్సర్ ఇచ్చాడు విశాల్.
ప్రస్తుతం లాఠి సినిమా బిజీలో ఉన్న విశాల్.. ఈమూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. పెళ్ళి అంటే పెద్ద బాధ్యత. అది నిర్వర్తించాలి అంటే దానికి సిద్దం అవ్వాలి. ప్రస్తుతం నేను నా ఫోకస్ అంతా పని మీదనే పెట్టాను. నా వృత్తిలో ఎంత నిబద్ధతతో ఉంటానో.. ఫ్యామిలీ లైఫ్ లో కూడా అంతే నిబద్ధతతో ఉండాలిక కదా..? ఇటు సినిమాలు చేసుకుంటూ.. బిజీ బిజీగా ఉన్న టైమ్ లో పెళ్ళి చేసుకుని ఇబ్బంది పడటం కష్టం అన్నారు విశాల్. ఇక ఈ ఏడాది పెళ్లి చేసుకుంటారా అని మీడియా అదగ్గా..? ఆ చేసుకుంటాను.. ప్రభాస్ పెళ్లి తరువాత వెంటనే చేసుకుంటాను అంటూ క్రేజీ ఆన్సర్ ఇచ్చారు విశాల్.
ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విశాల్.. గత కొద్దికాలంగా సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. తన కో స్టార్ అభినయ తో ప్రేమలో ఉన్నట్టు కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. మూగ చెవిటి అమ్మాయి అని అభినయను త్వరలో ఆయన పెళ్ళాడబోతున్నట్టు సమాచారం.