‘కార్తీకేయ2’ క్రేజ్ మాములుగా లేదుగా.. ఆడియెన్స్ ఫస్ట్ ఛాయిస్ ఈ మూవీకే.. ఫాస్ట్ గా టికెట్ బుకింగ్స్

Published : Aug 12, 2022, 02:34 PM IST
‘కార్తీకేయ2’ క్రేజ్ మాములుగా లేదుగా..  ఆడియెన్స్ ఫస్ట్ ఛాయిస్ ఈ మూవీకే..  ఫాస్ట్ గా టికెట్ బుకింగ్స్

సారాంశం

యంగ్ హీరోహీరోయిన్ నిఖిల్, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం ‘కార్తీకేయ 2’ (Karthikeya 2).  ఈ చిత్రం రేపు గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. అయితే ఆడియెన్స్ లో ఈ మూవీ క్రేజ్ వేరే లెవల్ లో ఉంది.   

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ (Nikhil Siddhartha) విభిన్న కథాంశాలతో  ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. మైథలాజికల్ ఫిల్మ్ ‘కార్తికేయ’కు సీక్వెల్ గా ప్రస్తుతం ‘కార్తికేయ 2’తో  అలరించేందుకు సిద్ధమయ్యాడు. ఆగస్టు 13న (రేపు) గ్రాండ్ గా ఈ చిత్రం థియేట్రికల్ రన్ ప్రారంభం కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తుండటం విశేషం. ఇప్పటికే ‘కార్తీకేయ 2’ నుంచి అప్డేట్స్ ఆడియెన్స్ లో సినిమాపై ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేశాయి. మరోవైపు చిత్ర యూనిట్ కూడా భిన్నంగా ప్రమోషన్స్ ను చేయడం సినిమాపై మరింత హైప్ ను క్రియేట్ చేసింది. రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ విజువల్ వండర్ గా నిలవడం ప్రేక్షకుల చూపును ఆకర్షిస్తోంది.

అయితే తాజాగా ఓ నెటిజన్ ట్విటర్ లో నిర్వహించిన ఆడియెన్స్ పోల్ లో ‘కార్తీకేయ 2’కే ఎక్కువ శాతం మద్దతు దక్కింది. ఈ పోల్ లో బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ నటించిన ‘లాల్ సింగ్ చడ్డా’, అలాగే ‘రక్షా బంధన్’ చిత్రాలు ఉన్నాయి. ఈ పోల్ తో ప్రేక్షకులు,  నెటిజన్లు మాత్రం ప్రస్తుతం ‘కార్తీకేయ 2’నే  చూసేందుకు  సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా బుక్ మై షో ద్వారా టికెట్స్ అందుబాటులో ఉండగా.. చాలా ఫాస్ట్ గా టికెట్స్ బుక్ అవుతున్నాయి. ఈ రోజు ఉదయం వరకు 60 కే ప్లస్ టికెట్స్ అమ్ముడు పోయాయి. ఇదే విషయాన్ని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇక నిఖిల్, అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) తమదైన శైలిలో అభిమానులకు సినిమాపై ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తున్నారు. తమ సినిమాను రేపు థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయాలని కోరుతున్నారు.

మూవీలో హీరోహీరోయిన్లుగా నిఖిల్, అనుపమా పరమేశ్వరన్ నటిస్తున్నారు.  చందూ మండేటి చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లపై మూవీని సంయుక్తంగా నిర్మించారు. అనుపమ్ ఖేర్, శ్రీనివాస‌రెడ్డి, ప్ర‌వీణ్‌, ఆదిత్యా మీన‌న్‌, తుల‌సి, స‌త్య, వైవా హ‌ర్ష‌, వెంక‌ట్‌ కీలక పాత్రల్లో నటించారు. తెలుగులో రూపుదిద్దుకున్న ఈ చిత్రం అన్నీ భాషల్లో రిలీజ్ కానుంది. 

 

 

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Latest Episode: జ్యోకు గట్టిగా ఇచ్చిపడేసిన కార్తీక్- మనుమడిని మెచ్చుకున్న పారు
Bayilone Ballipalike : దుమ్ములేపుతున్న మంగ్లీ ఫోక్ సాంగ్, 10 రోజుల్లోనే ఎన్ని కోట్ల వ్యూస్ రాబట్టిందంటే?