‘ఆర్ఆర్ఆర్’ టెలివిజన్ ప్రీమియర్ బ్లాస్ట్.. ఒకే రోజు మూడు ఛానెళ్లలో ప్రసారం.. ఫ్యాన్స్ కు పండగే..

By team teluguFirst Published Aug 12, 2022, 11:50 AM IST
Highlights

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందే తెలిసిందే. థియేటర్లలో, ఓటీటీలో ఊపూపిన ఈ బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ టెలివిజన్ ప్రీమియర్ కు సిద్ధమైంది. ఈ మేరకు తాజాగా అదిరిపోయే అప్డేట్ అందింది. 
 

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’(RRR) క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా కొనసాగిన ఈ చిత్రం ఇటు ఓటీటీలోనూ మంచి వ్యూయర్ షిప్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అటు ఇతర దేశాల్లోనూ ‘ఆర్ఆర్ఆర్’ ఉన్న క్రేజ్ చూస్తే తెలుగు సినిమా సత్తా ఏంటో అర్థమవుతోంది. ఈ ఏడాది రిలీజ్ అయిన చిత్రాల్లో రిపీటెడ్ ఆడియెన్స్ ను దక్కించుకున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. కాగా ఈ చిత్రం టెలివిజన్ ప్రీమియర్ కు ముహుర్తం ఫిక్స్ అయ్యింది. అంతేకాకుండా ఈ చిత్ర అభిమానుల కోసం ఏకంగా మూడు ఛానెల్స్ లో ఒకే రోజు ప్రసారం చేయనున్నట్టు ప్రకటించారు.

స్వాతంత్ర్య దినోత్సవానికి ఒక రోజు ముందు  ఆగస్టు 14న ‘ఆర్ఆర్ఆర్’ ఇంటింటి సందడి చేయనుంది. ఒకే రోజు ఏకంగా మూడు ప్రముఖ ఛానెల్స్ లో  ఈ బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ ప్రసారం కానుంది. తెలుగు వెర్షన్ ను ‘స్టార్ మా’లో సాయంత్రం 5:30కి, మలయాళ వెర్షన్ ను ప్రముఖ ఆసియా నెట్ ఛానెల్ లో రాత్రి 7:00 గంటలకు, హిందీ వెర్షన్ ను ‘జీ సినిమా’లో రాత్రి 8:00 గంటలకు ప్రసారం చేయనున్నారు. ఈ బిగ్గెస్ట్ సినిమాటిక్ ను ప్రేక్షకులు తమ ఇంట్లోనూ వీక్షించేందుకు రెడీగా ఉన్నారు. అద్భుతమైన విజువల్స్, అదిరిపోయే యాక్షన్ సీన్స్ ను మరోసారి చూడబోతున్నందుకు ఎగ్జైట్ ఫీలవుతున్నారు. 

ఈ చిత్రంలో ఉద్యమ వీరులు సీతారామ రాజు, కొమురం భీం పాత్రల్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) నటించిన విషయం తెలిసిందే. సీత పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ (Alia Bhatt) అలరించింది. పలు కీలక పాత్రను అజయ్ దేవగన్, నటి శ్రియా పోషించి ఆకట్టుకున్నారు. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై రూపొందించిన ఈ చిత్రానికి నిర్మాతగా డీవీవీ దానయ్య వ్యవహరించారు. అద్భుతమైన సంగీతంతో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణీ తన మార్క్ చూపించారు. బాక్సాఫీస్ వద్ద కూడా ‘ఆర్ఆర్ఆర్’ రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన విషయం తెలిసిందే. ఇక ఓటీటీలోనూ మిలియన్ల వ్యూస్ ను దక్కించుకుని రికార్డు క్రియేట్ చేసింది. మరో రెండు రోజుల్లో ఇంటింటి ‘ఆర్ఆర్ఆర్’ సందడి ప్రారంభం కానుంది.  

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by RRR Movie (@rrrmovie)

click me!