విజయ్ - అట్లీ.. ఆటల కోసం 6కోట్లు

Published : Apr 09, 2019, 03:06 PM IST
విజయ్ - అట్లీ.. ఆటల కోసం 6కోట్లు

సారాంశం

కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ నెక్స్ట్ చేయబోతున్న సినిమా కోసం దర్శకుడు అట్లీ గట్టి ప్లాన్స్ వేసుకున్నట్లు అర్ధమవుతోంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఇప్పటికే స్పెషల్ గా కొన్ని వర్క్ షాప్స్ కూడా నిర్వహించారు.

కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ నెక్స్ట్ చేయబోతున్న సినిమా కోసం దర్శకుడు అట్లీ గట్టి ప్లాన్స్ వేసుకున్నట్లు అర్ధమవుతోంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఇప్పటికే స్పెషల్ గా కొన్ని వర్క్ షాప్స్ కూడా నిర్వహించారు. షారుక్ ఖాన్ చెక్ దే ఇండియా తరహాలో ఫుట్ బాల్ కోచ్ గా విజయ్ కనిపించనున్నాడు. 

అసలు విషయంలోకి వస్తే.. సినిమా ఎక్కువగా సాకర్ గేమ్ కి సంబందించిన సన్నివేశాలు ఉంటాయి కాబట్టి 6 కోట్లతో ప్రత్యేకంగా కొన్ని సెట్స్ నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రొఫెషినల్ ప్లేయర్స్ తో పాటు నటీనటులకు ఈ స్పోర్ట్స్ పై అవగాహనా వచ్చేలా శిక్షణ ఇస్తున్నారు. దాదాపు 100 కోట్ల వరకు సినిమా కోసం ఖర్చు చేస్తున్నట్లు టాక్. 

సర్కార్ సినిమాతో తమిళ రాజకీయాలను టచ్ చేసి 200 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకున్న విజయ్ ఈ సినిమాతో ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి. ఇంతకుముందు అట్లీ - విజయ్ కాంబినేషన్ లో వచ్చిన తేరి - మెర్సల్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టాయి.   

PREV
click me!

Recommended Stories

Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌
రూ. 50 లక్షలతో తీస్తే రూ. 100 కోట్లు వచ్చింది.. దుమ్మురేపిన ఈ చిన్న సినిమా ఏంటో తెలుసా.?