#HolyWound: లెస్బియన్ కథాంశంతో సైలెంట్ మూవీ,ఆగస్ట్ లో రిలీజ్

Published : Jul 20, 2022, 07:20 AM IST
#HolyWound: లెస్బియన్ కథాంశంతో సైలెంట్ మూవీ,ఆగస్ట్ లో రిలీజ్

సారాంశం

 ఎలాంటి సంభాషణలు లేకుండా మూకీ మూవీ కావడంతో ఈ సైలెంట్‌ ఎరోటిక్ డ్రామా పై ప్రేక్షకులలో ఆసక్తి నెలకొంది. గతంలో కమల్‌ హాసన్‌ హీరోగా సింగీతం శ్రీనివాస్‌ తెరకెక్కించిన పుష్పక విమానం మూవీ తరహాలోనే ‘హోలీ ఊండ్ ’ మూవీలో పాత్రలు మాట్లాడవు. కేవలం బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌తోనే మూవీ కొనసాగనుంది.  

గే, లెస్బియన్, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్ ల చుట్టూ తిరిగే కథాంశాలకు ఇన్నాళ్లూ హాలీవుడ్ ఆశ్రయమిస్తూ వచ్చింది. ఇప్పుడు మెల్లి మెల్లిగా మనకు కూడా ఆ సినిమాలు పెరుగుతున్నాయి. ఈ సినిమాలను భాషా భేధం లేకుండా ఓ వర్గం ఆదరిస్తుందనే నమ్మకం సిని పరిశ్రమలో ఉంది. అయితే ఇలాంటి కథను సైలెంట్ సినిమాగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు మళయాళ దర్శకుడు అశోక్.ఆర్ నాథ్.

#HolyWound హోలీ ఊండ్ టైటిల్ తో రూపొందిన ఈ సినిమా ఎరోటిక్ సైలెంట్ మూవీ.  ఈ సినిమాని ఓటిటి ప్లాట్ ఫామ్ ల పైకి ఆగస్ట్ 12న రిలీజ్ చేస్తున్నారు. ఈ మేరకు ఓటిటి సంస్దలతో చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఓటిటి ప్లాట్ ఫామ్ ఫైనల్ అయ్యాక ఈ సినిమా విషయమై అఫీషియల్ ప్రకటన రాబోతోంది.

 ఎలాంటి సంభాషణలు లేకుండా మూకీ మూవీ కావడంతో ఈ సైలెంట్‌ ఎరోటిక్ డ్రామా పై ప్రేక్షకులలో ఆసక్తి నెలకొంది. గతంలో కమల్‌ హాసన్‌ హీరోగా సింగీతం శ్రీనివాస్‌ తెరకెక్కించిన పుష్పక విమానం మూవీ తరహాలోనే ‘హోలీ ఊండ్ ’ మూవీలో పాత్రలు మాట్లాడవు. కేవలం బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌తోనే మూవీ కొనసాగనుంది.  డైలాగ్స్‌ లేని సైలెంట్‌ సినిమాను కేవలం ఆ నటీనటుల హావభావాలతో ఎంజాయ్‌ చేసే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉంది.  ఓటిటి దగ్గర  కచ్చితంగా  సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తుందని దర్శక,నిర్మాతలు నమ్ముతున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Alia Bhatt Pregnancy: ఆలియా మళ్లీ ప్రెగ్నెంటా? కరణ్ జోహార్ పార్టీ ఫొటోలతో కొత్త చర్చ
Sobhita Dhulipala: నాగచైతన్యతో రిలేషన్‌షిప్‌పై ట్రోలింగ్... తొలిసారి నోరు విప్పిన శోభితా ధూళిపాళ