సోనూసూద్ సాయంతో కోమా నుంచి బయటపడ్డ యువకుడు.. ముంబయి వరకు బైక్ ర్యాలీ.. ఎమోషనల్ అయిన రియల్ హీరో..

Published : Jul 19, 2022, 06:58 PM IST
సోనూసూద్ సాయంతో కోమా నుంచి బయటపడ్డ యువకుడు.. ముంబయి వరకు బైక్ ర్యాలీ.. ఎమోషనల్ అయిన రియల్ హీరో..

సారాంశం

బాలీవుడ్ స్టార్, రియల్ హీరో సోనూ సూద్ చేసిన సేవా కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల తెలంగాణ యువకుడి ఆరోగ్యం విషయంలో సాయం చేసిన ఆయన.. అతడు కోలుకోవడం పట్ల ఎమోషనల్ అయ్యాడు.   

మహమ్మారి కరోనా వైరస్ కారణంగా నెలకొన్న పరిస్థితులతో రెండేండ్ల కింద దేశంలో సామాన్య ప్రజలు పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. బయటికి వస్తే మహమ్మారి సోకి చనిపోయే పరిస్థితుల్లో సాధారణ ప్రజలకు ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యారు. కరోనా (Covid 19)తో ఏర్పడ్డ దుర్భర పరిస్థితికి చలించిపోయిన సోనూసూద్ రంగంలోకి దిగాడు. ముఖ్యంగా పక్క రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కూలీలు, విదేశాల్లోని భారతీయులను గమ్యస్థానాలకు చేర్చడంలో ముఖ్య పాత్ర పోషించారు. అలాగే ఆయా రాష్ట్రాలకు కోవిడ్ ఫండ్ నూ అందించారు. కోవిడ్-19 సంక్షోభ సమయంలో నిరుపేద వ్యక్తులందరికీ రియల్ హీరోగా మారాడు. 

ఆయన ఏర్పాటు చేసిన స్పెషల్ టీం ద్వారా పేదలకు నిత్యావసర సరుకులు, మాస్కులు, మెడికల్ కిట్ అందించారు. అంతేకాకుండా ఆర్థికంగా బలహీనంగా ఉన్న వారికి ఉపాధి కల్పించాడు. అలాగే వేలాది మందికి ఉచిత వైద్య సదుపాయం కూడా అందించారు. ఈ క్రమంలోనే తెలంగాణ (Telangana)కు చెందిన రామ్ ప్రసాద్ భండారి అనే యువకుడు గత కొద్ది రోజుల కింద ‘కోమా’లోకి వెళ్లారు. దీంతో సోనూసూద్ యువకుడి చికిత్సకు సంబంధించిన అన్ని సదుపాయాలను ఏర్పాటు చేశారు. ఇటీవల రామ్ ప్రసాద్ కోమాను కోలుకున్నాడు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు సంతోషించారు. 

అయితే రామ్ ప్రసాద్ కోలుకోగానే ముందుగా సోనుసూద్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపేందుకు ఆయన ఇంటికి వెళ్లారు. ఆయనతో తన కూతురుని కూడా తీసుకెళ్లాడు. బైక్ కు జాతీయ జెండాను, జై సోనూసూద్ అనే మరో జెండాను కట్టుకొని, సోనూసూద్ ఫొటో ఉన్న టీషర్ట్స్ ను ధరించి ర్యాలీగా తెలంగాణ నుంచి ముంబయి వరకు వెళ్లాడు. కొన్ని రోజుల ప్రయాణం తర్వాత ముంబయికి చేరిన రామ్ ప్రసాద్ కూతురితో సోనూసూద్ కు కనిపించాడు. దీంతో సోనూ చాలా ఎమోషనల్ అయ్యాడు. వారి బాగోగులు తెలుసుకున్నారు. తనకు థ్యాంక్స్ చెప్పేందుకు వచ్చిన తండ్రీ, కూతురుతో ప్రేమగా మాట్లాడారు. ఈ సందర్భంగా వారితో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో నూ పోస్ట్ చేశాడు. ఎమోషనల్ నోట్ కూడా రాశాడు. 

ట్వీట్ లో.. రామ్ ప్రసాద్ కొద్ది రోజులు కోమాలోనే ఉన్నాడు. వైద్యులందరూ కూడా అతనిని విడిచిపెట్టారు. కానీ అదృష్టవశాత్తూ, మేము సమయానికి సహాయం అందించగలిగాం. అతని ప్రాణాన్ని రక్షించగలిగాం. తన కూతురు కళ్లలోని చూపు వెలకట్టలేనిది. అతను నా ముందు సంతోషంగా, ఆరోగ్యంగా నిల్చొని ఉండటం అద్భుతంగా అనిపిస్తోంది. ఇలాంటి క్షణాలే నన్ను లక్ష్యం వైపు కష్టపడి పనిచేయడానికి ప్రేరేపిస్తాయి. ఎంతో దూరం నుంచి ముంబయి వరకు రావడం నిజంగా బ్లెస్సింగ్ గా భావిస్తున్నానని తెలిపారు. దీంతో నెటిజన్లు కూడా సోనూ చేసిన సాయానికి ‘సెల్యూట్’ చేస్తున్నారు. 

 

 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?
Malliswari Review: బావ మరదలుగా ఎన్టీఆర్, భానుమతి రొమాన్స్, ఫస్ట్ తెలుగు పాన్ వరల్డ్ మూవీగా మల్లీశ్వరి రికార్డు..