కొరటాలకి సాయం చేసేందుకు ముందుకొచ్చిన ఎన్టీఆర్.. ఇది పెద్ద రిలీఫే?

Published : Jul 19, 2022, 09:45 PM IST
కొరటాలకి సాయం చేసేందుకు ముందుకొచ్చిన ఎన్టీఆర్.. ఇది పెద్ద రిలీఫే?

సారాంశం

`ఆచార్య` తెచ్చిన తంటాలతో ఆ సమస్యలోనే ఇరుక్కున్న కొరటాల దాన్నుంచి బయటపడలేకపోతున్నారట. దీంతో ఎన్టీఆరే స్వయంగా రంగంలోకి దిగినట్టు సమాచారం.

స్టార్ డైరెక్టర్‌ కొరటాల శివ(Koratala Siva) అనూహ్యంగా వివాదాల్లో ఇరుక్కున్న విషయం తెలిసిందే. చిరంజీవి హీరోగా ఆయన రూపొందించిన `ఆచార్య`(Acharya) చిత్రం భారీ పరాజయం చవిచూసిన నేపథ్యంలో ఆ సినిమా తెచ్చిన నష్టాలను కొరటాల పూడ్చాల్సి వస్తోంది. సినిమా రైట్స్ అమ్మడంలో, బిజినెస్‌ చేయడంలో ఆయన ముందుండి నడిపించడంతో నష్టాలకు బాధ్యత వహించాల్సి వచ్చింది. సినిమాని కొన్న బయ్యర్లంతా నష్టపోవడంతో కొరటాల ఇంటి మీద పడ్డారు. దీంతో ఒక్కొక్కిరికి సెటిల్‌మెంట్ చేసుకుంటూ వస్తున్నారు కొరటాల. 

ఆల్మోస్ట్ అన్ని ఏరియాల సెటిల్‌మెంట్‌ అయిపోయిందని తెలుస్తుంది. అంతకు ముందే చిరంజీవి, రామ్‌చరణ్‌ కొంత వరకు భరోసా ఇవ్వడంతో కొన్ని ఏరియాల్లో సెటిల్‌ అయ్యిందని, ఇప్పుడు అన్నింటిని కొరటాల సెటిల్‌ చేశారని టాక్. ఈ క్రమంలో ఆయన ఆస్తులను కూడా పోగొట్టుకోవాల్సి వచ్చిందనే రూమర్స్ స్ప్రెడ్‌ అయ్యాయి. ఈ నేపథ్యంలో కొరటాల తన నెక్ట్స్ సినిమా `ఎన్టీఆర్‌ 30`(NTR30)ని స్క్రిప్ట్ ని పూర్తి చేయడంలో ఆలస్యమవుతుందట. `ఆచార్య` తెచ్చిన తంటాలతో ఆ సమస్యలోనే ఇరుక్కున్న కొరటాల దాన్నుంచి బయటపడలేకపోతున్నారట. దీంతో ఎన్టీఆరే (Ntr) స్వయంగా రంగంలోకి దిగినట్టు సమాచారం.

ఎన్టీఆర్‌ `ఆర్ఆర్‌ఆర్‌` తర్వాత కొరటాలతో సినిమా చేయబోతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ `ఆచార్య` ప్రభావంతో, కొరటాల ఆ సమస్యల్లో ఇరుక్కోవడంతో కథపై దృష్టి పెట్టలేకపోయారు. దీంతో షూటింగ్‌ ప్రారంభం కావడానికి ఆలస్యమవుతుంది. ఇప్పటికీ స్క్రిప్ట్ వర్క్ పూర్తి కాకపోవడంతో ఇక లాభం లేదని భావించిన ఎన్టీఆర్‌ రంగంలోకి దిగారట. కొరటాలకి సహాయం చేయడానికి ముందుకొచ్చారని సమాచారం. 

అయితే తారక్‌ సహాయం చేయబోయేది తనతో చేయబోయే సినిమా స్క్రిప్ట్ విషయంలో అని తెలుస్తుంది. కొరటాల కథపై పూర్తి స్థాయిలో ఫోకస్‌ పెట్టలేకపోతున్న నేపథ్యంలో ఎన్టీఆరే ఓ స్టార్‌ రైటర్ ని మాట్లాడి స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్‌ చేసే పని అప్పజెప్పారట. ఆ రైటర్‌ గతంలో ఎన్టీఆర్ కి మంచి హిట్‌ ఇచ్చిన నేపథ్యంలో `ఎన్టీఆర్‌ 30`కి ఆయన వర్క్ చేస్తే అది హెల్ప్ అవుతుందని, స్క్రిప్ట్ మరింత బాగా రావడానికి ఛాన్స్ ఉంటుందని ఎన్టీఆర్‌ భావిస్తున్నారట. అయితే ఆ రైటర్ ఎవరనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. ఇందులో నిజమెంతా అనేది కూడా సస్పెన్స్. కానీ ఇప్పుడీ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతుంది. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

500 కోట్ల ధురంధర్, స్టార్ హీరోలను కూడా భయపెడుతున్న రణ్ వీర్ సింగ్ సినిమా
రవితేజ సంచలన నిర్ణయం, మాస్ మహారాజా ట్యాగ్ ను దూరం పెట్టిన స్టార్ హీరో?