అన్నకు ప్రేమతో... కల్యాణ్ రామ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ఎన్టీఆర్

Published : Jul 05, 2017, 08:50 PM ISTUpdated : Mar 25, 2018, 11:45 PM IST
అన్నకు ప్రేమతో... కల్యాణ్ రామ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ఎన్టీఆర్

సారాంశం

కల్యాణ్ రామ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ఎన్టీఆర్ ట్విటర్ వేదికగా హ్యాపీ బర్త్ డే అంటూ ట్వీట్ అన్నను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న ఫోటో పెట్టిన ఎన్టీఆర్

నందమూరి వారసత్యం అంటే తెలుగు నాట ఎంత క్రేజుందో తెలిసిందే. ఎన్టీఆర్ తనయుడు నందమూరి హరికృష్ణ తనయులు జూ.ఎన్టీఆర్, కళ్యాన్ రామ్ లు హీరోలు గా ఎంట్రీ ఇచ్చి మరింత క్రేజ్ సంపాదించారు. కళ్యాణ్ రామ్ ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే..నిర్మాణ రంగంలో తన ప్రత్యేకత చాటుకున్నాడు.  ప్రస్తుతం తన తమ్ముడు ఎన్టీఆర్ నటిస్తున్న ‘జై లవకుశ’ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.  ఈ రోజు నందమూరి కళ్యాన్ రామ్ పుట్టి రోజు...ఇక తన సోదరుడు నందమూరి కల్యాణ్ రామ్ ను వెనుక నుంచి ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న ఫోటోను ట్విట్టర్ లో పోస్టు చేసిన జూనియర్ నందమూరి తారకరామరావు... "పుట్టిన రోజు శుభాకాంక్షలన్నా" అంటూ విషెస్ చెప్పాడు.  

కల్యాణ్ రామ్ పుట్టిన రోజును పురస్కరించుకుని తాజా సినిమా 'ఎమ్ఎల్ఏ' (మంచి లక్షణాలున్న అబ్బాయి) ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన కాజల్ మరోసారి నటించనుంది. కాజల్ తొలి సినిమా 'లక్ష్మీ కళ్యాణం'లో కల్యాణ్ రామ్ తో కలిసి నటించింది. జూనియర్ ఎన్టీఆర్ విష్ చేసిన కాసేపటికే కల్యాణ్ రామ్ కు అభిమానుల నుంచి విషెష్ వెల్లువెత్తాయి. నందమూరి కల్యాణ్ రామ్ కు ఆసియానెట్ పుట్టిన రోజు శుభాకాంక్షలు. 

PREV
click me!

Recommended Stories

భార్యతో పదేళ్ల ప్రేమను సెలబ్రేట్ చేసుకున్న రిషబ్ శెట్టి..బ్యూటిఫుల్ ఫోటోస్ వైరల్
Medha Rana: బోర్డర్ 2తో ప్రేక్షకుల మనసు గెలిచిన నటి ? ఆమె కుటుంబ సభ్యులంతా..