ప్రభాస్ పక్కన మరొకరిని రానివ్వదేమో.. సాహోలో కూడా..

Published : Jul 05, 2017, 08:33 PM ISTUpdated : Mar 25, 2018, 11:45 PM IST
ప్రభాస్ పక్కన మరొకరిని రానివ్వదేమో.. సాహోలో కూడా..

సారాంశం

ప్రబాస్ తో హిట్ పెయిర్ అనిపించుకున్న అనుష్క బిల్లా, మిర్చి, బాహుబలి సినిమాల్లో ప్రభాస్ సరసన నటించిన అనుష్క తాజాగా సాహో చిత్రంలోనూ తనే హీరోయిన్ అని వినిపిస్తోంది

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత నటిస్తున్న సాహో సినిమాలో హీరోయిన్ ఎవరన్నది ఇంకా ఫైనల్ అవ్వలేదని బయటికి అంటున్నారు. బాలీవుడ్ భామలు పరిణితి చోప్రా అని, కత్రినీ కైఫ్ అని, శ్రద్ధా కపూర్ అని ఇలా చాలా పేర్లు వినిపించాయి. కాని అసలు విషయం ఏంటంటే ప్రభాస్ పక్కన మళ్లీ అనుష్కకే ఛాన్స్ ఇచ్చినట్టు ఎక్స్ క్లూజివ్ సమాచారం. బాహుబలిలో దేవసేనగా అదరగొట్టిన అనుష్క మరోసారి ప్రభాస్ తో రొమాన్స్ కు రెడీ అయ్యింది.

 

బాహుబలి రిలీజ్ రోజునే సాహో టీజర్ థియేటర్లలో వదలగా అప్పటికి హీరోయిన్ ను ఫైనల్ చేశారట. ప్రభాస్ పక్కన ఎవరెవరినో అనుకోగా ఫైనల్ గా మళ్లీ అనుష్కకే ఆ ఛాన్స్ వచ్చింది. బిల్లా, మిర్చి, బాహుబలి సినిమాలతో సూపర్ హిట్ పెయిర్ గా ప్రశంసలు అందుకున్న ప్రభాస్, అనుష్కలు సాహోలో కూడా సర్ ప్రైజ్ ఇవ్వనుందని తెలుస్తోంది. 

 

రన్ రాజా రన్ దర్శకుడు సుజిత్ డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను యువి క్రియేషన్స్ బ్యానర్లో దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఎయిర్ ఫైట్ లాంటి అంశాలను పెట్టి ఇదో హాలీవుడ్ రేంజ్ లో సినిమా అప్పియరెన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే టీజర్ లో ఆ మేరకు షాట్స్ కట్ చేసిన టీమ్.. బాహుబలితో నేషనల్ వైడ్ మార్కెట్ ఏర్పరచుకున్న ప్రభాస్.. సాహోని కూడా తెలుగు, తమిళ, హింది భాషల్లో రిలీజ్ చేస్తే కలెక్షన్స్ వర్షం కురిపిస్తాడని భావిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Yogibabu బ్రహ్మానందం కలిసి వస్తే.. నవ్వులు సునామీ వచ్చేది ఎప్పుడంటే?
Manchu Manoj: రామ్‌ చరణ్‌, శింబులను దించుతున్న మంచు మనోజ్‌.. అదిరిపోయేలా `డేవిడ్‌ రెడ్డి` గ్లింప్స్