AshuReddy: యాంకర్ రవికి అషు రెడ్డి బంపర్ ఆఫర్.. ఇద్దరి ముద్దు ముచ్చట్ల వీడియో వైరల్

Sreeharsha Gopagani   | Asianet News
Published : Feb 14, 2022, 07:19 AM IST
AshuReddy: యాంకర్ రవికి అషు రెడ్డి బంపర్ ఆఫర్.. ఇద్దరి ముద్దు ముచ్చట్ల వీడియో వైరల్

సారాంశం

అషు రెడ్డి తన ఇన్స్టాగ్రామ్ లో గ్లామర్ పిక్స్ తో పాటు డబ్ స్మాష్ వీడియోల్ని కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇటీవల అషురెడ్డి ఎక్కువగా యాంకర్ రవితో కలసి సోషల్ మీడియాలో కనిపిస్తోంది.

తెలుగమ్మాయి, అందాల అషు రెడ్డి గురించి తెలియని కుర్రకారు ఉండరు. డబ్ స్మాష్ తో జూనియర్ సమంతగా గుర్తింపు పొందిన అషు రెడ్డి నటిగా కూడా అవకాశాలు అందుకుంటోంది. బిగ్ బాస్ 3 తెలుగులో ఛాన్స్ కొట్టేసి తన క్రేజ్ ని మరింతగా పెంచుకుంది. 

అషు రెడ్డి తన ఇన్స్టాగ్రామ్ లో గ్లామర్ పిక్స్ తో పాటు డబ్ స్మాష్ వీడియోల్ని కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇటీవల అషురెడ్డి ఎక్కువగా యాంకర్ రవితో కలసి సోషల్ మీడియాలో కనిపిస్తోంది. అతడితో ఉన్న ఫొటోస్,వీడియో షేర్ చేస్తోంది. ఆ మధ్యన యాంకర్ రవితో కలసి బైక్ రైడింగ్ చేస్తున్న హాట్ ఫొటోస్ ని నెటిజన్లతో పంచుకుంది. 

టోన్ జీన్స్ లో బైక్ పై అశు రెడ్డి మైండ్ బ్లోయింగ్ హాట్ గా దర్శనం ఇచ్చింది. తాజాగా రవితో ఉన్న మరో వీడియో షేర్ చేసింది అశు. ఈ వీడియో నెటిజన్లని విశేషంగా ఆకట్టుకుంటోంది. పుష్ప చిత్రంలోని అల్లు అర్జున్ డైలాగ్ తో అషురెడ్డి, రవి వీడియో చేశారు. 

'ఎన్నో నేనొచ్చి ఇచ్చేదా ముద్దు.. రేయ్ ఎవుర్తి రా అది..అన్నో అంటుంది.. మళ్ళీ ముద్దెడతానంటుంది.. తు.. రేయ్ యాడదొరికిన సంతరా ఇది' అంటూ అల్లు అర్జున్ చెప్పే డైలాగ్ భలే ఆకట్టుకుంది. ఈ డైలాగ్ పై అషురెడ్డి, రవి వీడియో చేశారు. అషురెడ్డి ముద్దిస్తానని బంపర్ ఆఫర్ ఇవ్వగా యాంకర్ రవి పుష్ప స్టైల్ లో సమాధానం ఇచ్చాడు. ఫన్నీగా ఉన్న ఈ వీడియో వైరల్ గా మారింది. 

రవి గత ఏడాది బిగ్ బాస్ 5లో పాల్గొన్నాడు. టాప్ 5 లోకి వెళతాడని భావించినప్పటికీ ముందుగానే ఎలిమినేట్ అయ్యాడు. దీనితో రవి ఫ్యాన్స్ బాగా హర్ట్ అయ్యారు. బిగ్ బాస్ నుంచి తిరిగొచ్చాక మళ్ళీ యాంకర్ గా దూసుకుపోతున్నాడు. 

 

PREV
click me!

Recommended Stories

Jason Sanjay: తండ్రి పేరు తీసేశాడా? 'సిగ్మా' టైటిల్ కార్డ్‌లో జేసన్ సంజయ్ సంచలనం!
Ustaad X Dhurandhar 2: ఉస్తాద్ కి పోటీగా ధురంధర్ 2 వస్తే జరిగేది ఇదేనా ? హరీష్ శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు